హమ్మయ్య... మీసం మెలితిప్పాడు

చిరంజీవి 150వ సినిమాలో చిన్న కదలిక వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి మెగాస్టార్ మేకోవర్ ప్రారంభించినట్టు కనిపిస్తోంది. తాజాగా ఓ ఫంక్షన్ కు హాజరైన చిరంజీవి…. డిఫరెంట్ మీసకట్టుతో దర్శనమిచ్చాడు. తన 150వ సినిమాకు చిరంజీవి ఇదే మీసకట్టుతో కనిపిస్తారని అంతా భావిస్తున్నారు. చిరు రీఎంట్రీ సినిమాకు సంబంధించి మెగా కాంపౌండ్ నుంచి పూర్తి వివరాలు రాకముందే… ఈ మీసకట్టు అందర్నీ బాగా ఎట్రాక్ట్ చేసింది.  తాజా సమాచారం ప్రకారం…. చిరంజీవి సినిమాకు నయనతారను దాదాపు కన్ […]

Advertisement
Update:2016-01-22 00:33 IST
చిరంజీవి 150వ సినిమాలో చిన్న కదలిక వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి మెగాస్టార్ మేకోవర్ ప్రారంభించినట్టు కనిపిస్తోంది. తాజాగా ఓ ఫంక్షన్ కు హాజరైన చిరంజీవి…. డిఫరెంట్ మీసకట్టుతో దర్శనమిచ్చాడు. తన 150వ సినిమాకు చిరంజీవి ఇదే మీసకట్టుతో కనిపిస్తారని అంతా భావిస్తున్నారు. చిరు రీఎంట్రీ సినిమాకు సంబంధించి మెగా కాంపౌండ్ నుంచి పూర్తి వివరాలు రాకముందే… ఈ మీసకట్టు అందర్నీ బాగా ఎట్రాక్ట్ చేసింది.
తాజా సమాచారం ప్రకారం…. చిరంజీవి సినిమాకు నయనతారను దాదాపు కన్ ఫర్మ్ చేశారు. సినిమాను వచ్చేనెల నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు. దర్శకుడు వీవీ వినాయక్ కథకు ఇప్పటికే కొన్ని మార్పులు చేస్తున్నట్టు సమాచారం. తమిళ్ లో హిట్టయిన కత్తి సినిమాకు రీమేక్ గా చిరంజీవి 150వ సినిమా రానుంది. రామ్ చరణ్ నిర్మాతగా మారి నిర్మించబోతున్న ఈ సినిమాకు, లైకా ప్రొడక్షన్స్ సంస్థ సహ-నిర్మాతగా వ్యవహరించనుంది.
Tags:    
Advertisement

Similar News