ప్రభాస్ కోసం పెళ్లి ప్రకటన జారీ

ప్రభాస్‌కు ఈ ఏడాది ఎలాగైనా పెళ్లి చేసేయాలని ఆయన కుటుంబం పట్టుదలతో ఉంది. వధువు కోసం అన్వేషణ మొదలుపెట్టారు. బాహుబలికి తగ్గ అమ్మాయిని వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలిసిన వారినీ పురమాయిస్తున్నారు. రెండురోజుల క్రితం కృష్ణంరాజు కూడా స్వయంగా ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రభాస్‌కు అమ్మాయిని వెతికే పనిలో నటుడు రానా కూడా తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ట్విట్టర్‌లో ఫన్నీగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభాస్‌ క్యాలిటీస్‌ను కూడా వివరించాడు. 36 ఏళ్ల […]

Advertisement
Update:2016-01-21 10:31 IST

ప్రభాస్‌కు ఈ ఏడాది ఎలాగైనా పెళ్లి చేసేయాలని ఆయన కుటుంబం పట్టుదలతో ఉంది. వధువు కోసం అన్వేషణ మొదలుపెట్టారు. బాహుబలికి తగ్గ అమ్మాయిని వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలిసిన వారినీ పురమాయిస్తున్నారు. రెండురోజుల క్రితం కృష్ణంరాజు కూడా స్వయంగా ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రభాస్‌కు అమ్మాయిని వెతికే పనిలో నటుడు రానా కూడా తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ట్విట్టర్‌లో ఫన్నీగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభాస్‌ క్యాలిటీస్‌ను కూడా వివరించాడు. 36 ఏళ్ల ప్రభాస్‌ను సంచారతెగకు చెందిన సైనిక నాయకుడిగా అభివర్ణించాడు. 6.2 అడుగు ఎత్తు ఉండి ఇంటిలో పనులకు కూడా బాగా ఉపయోగపడుతాడని హామీ ఇచ్చాడు. నచ్చిన అమ్మాయి కోసం కొండలు ఎక్కుతాడని… అమ్మాయిల వెంట పడే ఆకతాయి మాత్రం కాదన్నాడు. అమ్మాయి అందంగా ఉండాలట. ఆమె కోసం కొండలు, అడవులు సైతం గాలించాలనే విధంగా ఉండాలన్నాడు. అయితే ఈ ప్రకటన జస్ట్ ఫన్నీగా రానా పోస్టు చేశాడు.

Tags:    
Advertisement

Similar News