ఎన్టీఆర్ ను మరోసారి కెలికిన డిక్టేటర్
తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని తారక్ ఎన్ని సార్లు చెబుతున్నా…. ఎన్టీఆర్ గురించి మాట్లాడ్డానికి బాలయ్య ఇంట్రెస్ట్ చూపించకపోయినా…. అబ్బాయ్-బాబాయ్ మధ్య నీళ్లు పోసినా పెట్రోల్ లా మండుతుందనేది బహిరంగ రహస్యమై కూర్చుంది. ఇప్పుడీ రహస్యానికి మరింత మెరుగులు దిద్దాడు బాలయ్య. ఎన్టీఆర్ పై పరోక్షంగా మరో దెబ్బ వేశాడు. తాజాగా విడుదలైన డిక్టేటర్ సినిమాకు ప్రమోషన్ కల్పిస్తూ… ఈ ఏడాదిలోనే తొలి బ్లాక్ బస్టర్ అని వేయించుకున్నాడు బాలయ్య. అంటే డిక్టేటర్ కంటే ఒక […]
Advertisement
తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని తారక్ ఎన్ని సార్లు చెబుతున్నా…. ఎన్టీఆర్ గురించి మాట్లాడ్డానికి బాలయ్య ఇంట్రెస్ట్ చూపించకపోయినా…. అబ్బాయ్-బాబాయ్ మధ్య నీళ్లు పోసినా పెట్రోల్ లా మండుతుందనేది బహిరంగ రహస్యమై కూర్చుంది. ఇప్పుడీ రహస్యానికి మరింత మెరుగులు దిద్దాడు బాలయ్య. ఎన్టీఆర్ పై పరోక్షంగా మరో దెబ్బ వేశాడు. తాజాగా విడుదలైన డిక్టేటర్ సినిమాకు ప్రమోషన్ కల్పిస్తూ… ఈ ఏడాదిలోనే తొలి బ్లాక్ బస్టర్ అని వేయించుకున్నాడు బాలయ్య. అంటే డిక్టేటర్ కంటే ఒక రోజు ముందు విడుదలైన నాన్నకు ప్రేమతో సినిమా తొలి బ్లాక్ బస్టర్ కాదనేగా అర్థం. సరిగ్గా ఇక్కడే మరోసారి ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. నిజానికి ఏ సినిమా విడుదలైనా… దానికి ప్రచారం కల్పించుకునేందుకు, బ్లాక్ బస్టర్ అనో… సూపర్ హిట్ అనో… సెన్సేషనల్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ అనో… ఇలా రకరకాల పేర్లు పెట్టి వాడేస్తుంటారు. కానీ ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ – 2016 అని ప్రత్యేకంగా రాయించుకోవడం మాత్రం ఎన్టీఆర్ ను గిచ్చే కార్యక్రమమే అనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమౌతోంది. కాకపోతే… ఈ బాబాయ్-అబ్బాయ్ ఇద్దరికీ అర్థంకాని విషయం ఏంటంటే… డిక్టేటర్, నాన్నకు ప్రేమతో సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్లు కావు.
Click to Read:
Advertisement