అక్కడ భయపడ్డాడు... అదే జరిగింది....
మొదట్నుంచి యంగ్ టైగర్ కు ఓవర్సీస్ అంటే భయమే. ఎన్టీఆర్ సినిమాలేవీ అక్కడ పెద్దగా ఆడవు. ఎందుకంటే… తారక్ సినిమాలన్నీ పక్కా మాస్ మసాలాస్ తో నిండిఉంటాయి. అలాంటి మాస్ హీరో కూడా ఈసారి ఓవర్సీస్ పై నమ్మకం పెట్టుకున్నాడు. ఎందకంటే… నాన్నకు ప్రేమతో మూవీ కంప్లీట్ క్లాస్ మూవీ. పైగా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే. ఈ రెండు అంశాలు చాలు ఓవర్సీస్ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడానికి. అందుకే నాన్నకు ప్రేమతో సినిమా విదేశాల్లో కూడా వసూళ్ల […]
Advertisement
మొదట్నుంచి యంగ్ టైగర్ కు ఓవర్సీస్ అంటే భయమే. ఎన్టీఆర్ సినిమాలేవీ అక్కడ పెద్దగా ఆడవు. ఎందుకంటే… తారక్ సినిమాలన్నీ పక్కా మాస్ మసాలాస్ తో నిండిఉంటాయి. అలాంటి మాస్ హీరో కూడా ఈసారి ఓవర్సీస్ పై నమ్మకం పెట్టుకున్నాడు. ఎందకంటే… నాన్నకు ప్రేమతో మూవీ కంప్లీట్ క్లాస్ మూవీ. పైగా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే. ఈ రెండు అంశాలు చాలు ఓవర్సీస్ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడానికి. అందుకే నాన్నకు ప్రేమతో సినిమా విదేశాల్లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తుందని సంబరపడ్డాడు. కానీ తారక్ ఆశలు ఈసారి కూడా నెరవేరలేదు. అయితే ఈసారి తప్పు ఎన్టీఆర్ ది కాదు. అక్షరాలా దర్శక-నిర్మాతలదే. ఆఖరి క్షణంలో సెన్సార్ పూర్తిచేయడం, డ్రైవ్స్ ను విదేశాలకు పంపించడంలో జాప్యం జరగడంతో… ఓవర్సీస్ లో దాదాపు 40శాతం థియేటర్లలో నాన్నకు ప్రేమతో సినిమా అనుకున్న సమయానికి పడలేదు. దీంతో ఈ సినిమా దాదాపు 2లక్షల డాలర్లు కోల్పోయిందని సమాచారం. అదే ప్రింట్ సమయానికి వెళ్లి ఉంటే… కచ్చితంగా ఓవర్సీస్ లో ఎన్టీఆర్ తన మార్క్ వేసేవాడు.
Click to Read:
Advertisement