ఎన్టీఆర్ సినిమాని ఫస్ట్ డే చూసిన అఖిల్
స్టార్ హీరో సినిమాలకు ఫస్ట్ డే వెళ్లేది అతడి హార్డ్ కోర్ అభిమానులే. యంగ్ టైగర్ సినిమా కోసం అతడి అభిమానులంతా మొదటి రోజు సినిమా చూశారు. ఆ జాబితాలో అక్కినేని అఖిల్ కూడా చేరిపోయాడు. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాను…. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్లో చూశాడు.ఎన్టీఆర్ సినిమాను తొలి రోజే చూసేందుకు అఖిల్ రావడం అందర్నీ షాక్ కు గురిచేసింది. అఖిల్ అడిగితే ఎన్టీఆర్ స్పెషల్ షో వేస్తాడు. […]
Advertisement
స్టార్ హీరో సినిమాలకు ఫస్ట్ డే వెళ్లేది అతడి హార్డ్ కోర్ అభిమానులే. యంగ్ టైగర్ సినిమా కోసం అతడి అభిమానులంతా మొదటి రోజు సినిమా చూశారు. ఆ జాబితాలో అక్కినేని అఖిల్ కూడా చేరిపోయాడు. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాను…. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్లో చూశాడు.ఎన్టీఆర్ సినిమాను తొలి రోజే చూసేందుకు అఖిల్ రావడం అందర్నీ షాక్ కు గురిచేసింది. అఖిల్ అడిగితే ఎన్టీఆర్ స్పెషల్ షో వేస్తాడు. కానీ సిసింద్రీ మాత్రం థియేటర్లోనే చూడాలని ఫిక్స్ అయ్యాడు. ఎన్టీఆర్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని ఇప్పటికే పలుమార్లు చెప్పిన అఖిల్… ఆ మాటల్ని చేతల్లో చూపించాడు. సినిమా చూసిన తర్వాత తారక్ కు ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించాడట. ఈ విషయంలో తండ్రి నాగార్జునే తనకు ఆదర్శం అంటాడు అఖిల్. సినిమా ఎవరిదైనా బాగుంటే వెంటనే ఫోన్ చేసి అభినందించడం తనకు అలవాటని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో ఇగోలు, కక్షలు లాంటివి పెట్టుకోవడం ఒంటికి మంచిది కాదంటున్నాడు అఖిల్.
Advertisement