నాన్న‌కు ప్రేమ‌తో ప్రివ్యూ

నాన్నకు ప్రేమ‌తో  ప్ర‌పంచ వ్యాప్తంగా  ఈ రోజు విడుద‌లయింది. అయితే ఇప్ప‌టికే  బెనిఫిట్ షోలు ప్ర‌ద‌ర్శించారు.  అందుతున్న వార్త‌ల‌ను బ‌ట్టి నాన్నకు ప్రేమ‌తో మైండ్ గేమ్ తో సాగే  ఒక రివేంజ్ డ్రామ.   ఎన్టీఆర్, జ‌గ‌ప‌తి బాబు ల మ‌ధ్య  ఈ మైండ్ గేమ్ ఉంటుంది. క‌థ‌లో  ప్ర‌తి నాయ‌కుడు రోల్ పోషించిన  జ‌గ‌ప‌తి బాబు..  సైలెంట్ కిల్ల‌ర్.  విల‌నిజం సుకుమార్ స్టైల్లో  ఉంటుంది. జ‌గపతి బాబు త‌న‌య‌గా  ర‌కుల్  ప్రీతి సింగ్  చేసింది. ఈ […]

Advertisement
Update:2016-01-13 02:47 IST
నాన్నకు ప్రేమ‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ రోజు విడుద‌లయింది. అయితే ఇప్ప‌టికే బెనిఫిట్ షోలు ప్ర‌ద‌ర్శించారు. అందుతున్న వార్త‌ల‌ను బ‌ట్టి నాన్నకు ప్రేమ‌తో మైండ్ గేమ్ తో సాగే ఒక రివేంజ్ డ్రామ. ఎన్టీఆర్, జ‌గ‌ప‌తి బాబు ల మ‌ధ్య ఈ మైండ్ గేమ్ ఉంటుంది. క‌థ‌లో ప్ర‌తి నాయ‌కుడు రోల్ పోషించిన జ‌గ‌ప‌తి బాబు.. సైలెంట్ కిల్ల‌ర్. విల‌నిజం సుకుమార్ స్టైల్లో ఉంటుంది. జ‌గపతి బాబు త‌న‌య‌గా ర‌కుల్ ప్రీతి సింగ్ చేసింది. ఈ చిత్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌నంత అందంగా ర‌కుల్ ప్రీతిసింగ్‌ ను ద‌ర్శ‌కుడు సుకుమార్ వెండి తెర పై చూపించాడు. నిజంగా ఆమె అందం సినిమాకు ఒక ప్ల‌స్ అవుతుంద‌నేది స‌మాచారం. సాంగ్స్ న‌య‌నానంద‌క‌రంగా ఉండి .. ఎన్టీఆర్ డాన్స్ స‌త్తాను చాటే రెండు సాంగ్స్ కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ తండ్రి రోల్ లో రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించారు. తండ్రి కోడుకుల మ‌ధ్య ఉన్న స‌న్నివేశాలు అభిమానుల మ‌న‌సు దోచేస్తున్నాయనేది ప్ర‌స్తుతం స‌ర్వ‌త్ర వినిపిస్తున్న మాట‌. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ స‌రికొత్త గా ఉంది. ఇది ఇక నుంచి కొంత కాలం పాటు ట్రెండ్ గా మారుతుంది అనేది పరిశీల‌కుల టాక్. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీతిసింగ్ తొలిసారి త‌న వాయిస్ కు త‌నే డ‌బ్బింగ్ చెప్పింది. ఇది ఎంతో బావుంది.
ఎన్టీఆర్ తొలిసారి పాడిన ఫాలో ఫాలో సాంగ్ వీప‌రీత‌మైన క్రేజీగా ఉంది. పిక్చ‌రైజేష‌న్ ప‌రంగా ప్ర‌తి ఫ్రేమ్.. అత్యంత రిచ్ గా ఉండ‌టంతో సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఎక్క‌డ ప్రేక్ష‌కుడు క‌ళ్లు తిప్పుకునే చాన్స్ కూడా లేదు అనేది వినిపిస్తున్న స‌మాచారం. మొత్తం 168 నిమిషాల నిడివితో నాన్నాకు ప్రేమ‌తో చిత్రం చేశారు. మ‌రి ఓవ‌రాల్ గా సినిమా క‌మ‌ర్షియ‌ల్ రేంజ్ ఏమిటి… సినిమా క‌థ ఏ వ‌ర్గాల ఆడియ‌న్స్ ను బాగా ఎట్రాక్ట్‌ చేస్తుంది..? సంక్రాంతి హిట్ ఫిల్మ్ గా నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ లో ఈచిత్రం నిలుస్తుందా? ఎన్టీఆర్ ను 50 కోట్ల క్ల‌బ్ లో చేరుస్తుందా ? లేదా అనే విష‌యాలు తెలియాలంటే… ఈ సినిమా పూర్తి రివ్యూ ను ఫాలో కావాల్సిందే..ఇంకొద్ది సేప‌ట్లో నాన్నాకు ప్రేమ‌తో కంప్లీట్ రివ్యూ మీ తెలుగు గ్లోబల్‌లో రానుంది మ‌రి..
Tags:    
Advertisement

Similar News