ఎన్టీఆర్ కల ఈసారి కూడా నెరవేరట్లేదు

విదేశాల్లో పాపులర్ హీరోల జాబితా తీస్తే అందులో మొదటిస్థానం మహేష్ కే ఉంటుంది. ఒక్కోసారి మహేష్ ను పవన్ కల్యాణ్ కూడా క్రాస్ చేస్తుంటాడు. మొత్తమ్మీద వీళ్లిద్దరి తర్వాతే ఏ హీరో అయినా. తాజాగా బన్నీ, నాని లాంటి హీరోలు కూడా ఓవర్సీస్ లో సత్తా చాటుకున్నారు. కానీ ఇంత మాస్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ మాత్రం ఓవర్సీస్ లో రాణించలేకపోతున్నాడు. విదేశాల్లో కాస్తోకూస్తో స్ట్రాంగ్ బేస్ ఉన్నప్పటికీ… పవన్, మహేష్ సాధించినన్ని వసూళ్లను మాత్రం ఎన్టీఆర్ […]

Advertisement
Update:2016-01-12 00:33 IST
విదేశాల్లో పాపులర్ హీరోల జాబితా తీస్తే అందులో మొదటిస్థానం మహేష్ కే ఉంటుంది. ఒక్కోసారి మహేష్ ను పవన్ కల్యాణ్ కూడా క్రాస్ చేస్తుంటాడు. మొత్తమ్మీద వీళ్లిద్దరి తర్వాతే ఏ హీరో అయినా. తాజాగా బన్నీ, నాని లాంటి హీరోలు కూడా ఓవర్సీస్ లో సత్తా చాటుకున్నారు. కానీ ఇంత మాస్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ మాత్రం ఓవర్సీస్ లో రాణించలేకపోతున్నాడు. విదేశాల్లో కాస్తోకూస్తో స్ట్రాంగ్ బేస్ ఉన్నప్పటికీ… పవన్, మహేష్ సాధించినన్ని వసూళ్లను మాత్రం ఎన్టీఆర్ రాబట్టలేకపోతున్నాడు. అయితే తాజాగా వస్తున్న నాన్నకు ప్రేమతో సినిమాతోనైనా మంచి వసూళ్లు సాధిద్దామనుకుంటే… ఆ ఆశ కూడా లేకుండా పోయింది. అవును… చివరి నిమిషంలో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తికావడంతో…. ఓవర్సీస్ లో పలు చోట్ల అనుకున్న సమయానికి ఎన్టీఆర్ సినిమా ప్రదర్శితం కావట్లేదు. ఈ ప్రభావం…. తొలిరోజు వసూళ్లపై గణనీయంగా పడనుంది. సో… ఈసారి ఎన్టీఆర్ సినిమా వసూళ్లు ఎలా ఉండబోతున్నాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Tags:    
Advertisement

Similar News