ఎన్టీఆర్ దుమ్ము లేపుతున్నాడు !

ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదలకు సిద్ధమయింది. ఈనెల 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా పాటలకు శ్రోతలనుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాడిన పాటకు మరింత స్పందన వస్తోంది. తాజాగా ఈ పాట మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు చిత్రయూనిట్. నిర్మాత బీవీఎస్ ఎస్ ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ […]

Advertisement
Update:2016-01-11 08:40 IST

ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదలకు సిద్ధమయింది. ఈనెల 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా పాటలకు శ్రోతలనుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాడిన పాటకు మరింత స్పందన వస్తోంది. తాజాగా ఈ పాట మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు చిత్రయూనిట్. నిర్మాత బీవీఎస్ ఎస్ ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సమక్షంలో ఎన్టీఆర్ పాడిన ‘ఐ వాన్న ఫాలో ఫాలో ఫాలో యూ’ అంటూ పాడిన సాంగ్ మేకింగ్ వీడియోకు సైతం అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో విడుదల చేసిన 18 గంటలకే లక్ష 50 వేల వ్యూస్‌కు చేరువైందంటే…ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధమవుతోంది.

Full View

Tags:    
Advertisement

Similar News