నాన్నకు ప్రేమతో 8వేల రూపాయలు
ఎన్టీఆర్-సుకుమార్ ఫ్రెష్ కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమా ఇండస్ట్రీని వేడెక్కిస్తోంది. దీంతోపాటు విడుదలవుతున్న డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయనా సినిమాల కంటే….. నాన్నకు ప్రేమతో సినిమానే ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ వేడిని క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు బెనిఫిట్ షో పేరిట దందా షురూ అయింది. రిలీజ్ కు ఒక రోజు ముందే… అంటే జనవరి 12వ తేదీన ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న […]
Advertisement
ఎన్టీఆర్-సుకుమార్ ఫ్రెష్ కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమా ఇండస్ట్రీని వేడెక్కిస్తోంది. దీంతోపాటు విడుదలవుతున్న డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయనా సినిమాల కంటే….. నాన్నకు ప్రేమతో సినిమానే ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ వేడిని క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు బెనిఫిట్ షో పేరిట దందా షురూ అయింది. రిలీజ్ కు ఒక రోజు ముందే… అంటే జనవరి 12వ తేదీన ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న శివపార్వతి థియేటర్ లో నాన్నకు ప్రేమతో సినిమా ప్రీమియర్ ను ఏర్పాటుచేశారు. ఈ సినిమాకు కింది వరసలో ఉన్న సీట్లకు 4వేల రూపాయలు…. పైవరసలో ఉన్న సీట్లకు 8వేల రూపాయలు టిక్కెట్ ధరలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో… ఎన్టీఆర్ మీద ప్రేమ ఉన్నవాళ్లు, సినిమాను ఒక రోజు ముందే చూసేయాలనే కసి ఉన్నవాళ్లు…. జస్ట్ 8వేల రూపాయలు పట్టుకుంటే పనైపోతుంది. పనిలోపనిగా ప్రేక్షకులకు ఒక రోజు ముందే సినిమా టాక్ బయటకొచ్చేస్తుంది.
Advertisement