నాగ్ ఫ్యాన్స్ రెండో ప్రాధాన్యత ఏ చిత్రానికి?

ఏటా సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల మధ్య పోటీ కలెక్షన్ల వరకు మాత్రమే ఉండేది. ఈ సారి అలా లేదు ఎన్నికల్లో రాజకీయాల పార్టీల తరహాలో … సినిమా హిట్‌ కోసం డిక్టేటర్, నాన్నకు ప్రేమతో తలబడుతున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు నాగ్‌ సోగ్గాడే చిన్ని నాయనా కూడా పొంగల్‌ పోటీకి దిగింది. బాలయ్యకు అండగా టీడీపీ నేతలు పనిచేస్తుంటే (థియేటర్ల సంఖ్య పెంచడం వంటి వాటి కోసం) ఎన్టీఆర్‌కు మరికొందరు రహస్యంగా సాయపడుతున్నారు. హీరో నాగార్జున […]

Advertisement
Update:2016-01-10 04:37 IST

ఏటా సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల మధ్య పోటీ కలెక్షన్ల వరకు మాత్రమే ఉండేది. ఈ సారి అలా లేదు ఎన్నికల్లో రాజకీయాల పార్టీల తరహాలో … సినిమా హిట్‌ కోసం డిక్టేటర్, నాన్నకు ప్రేమతో తలబడుతున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు నాగ్‌ సోగ్గాడే చిన్ని నాయనా కూడా పొంగల్‌ పోటీకి దిగింది. బాలయ్యకు అండగా టీడీపీ నేతలు పనిచేస్తుంటే (థియేటర్ల సంఖ్య పెంచడం వంటి వాటి కోసం) ఎన్టీఆర్‌కు మరికొందరు రహస్యంగా సాయపడుతున్నారు. హీరో నాగార్జున కూడా ఎన్టీఆర్‌తో ”మీలో ఎవరు కోటిశ్వరుడు” కార్యక్రమం నిర్వహించి ”నాన్నకు ప్రేమతో” ప్రమోషన్‌కు తన వంతు సాయం చేసేశారు. నాగార్జునే కాదు, ఆయన ఫ్యాన్స్‌ కూడా నాన్నకు ప్రేమతో హిట్ కావాలని కోరుకుంటున్నారు. నాగ్ అభిమానులు తన మొదటి ప్రాధాన్యత ”సోగ్గాడే చిన్నినాయన”కు ఇస్తూ రెండో ప్రాధాన్యతగా ”నాన్నకు ప్రేమతో” చిత్రానికి మద్దతు పలుకుతున్నారు. ఇంకా లోతుగా చెప్పాలంటే బాలకృష్ణ, నాగార్జునకు కొద్దికాలంగా పడడం లేదు. శ్రీమన్నారాయణ, షిరిడిసాయి సినిమాల సమయంలో ధియేటర్ల విషయంలో ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని చెబుతుంటున్నారు. అందుకే ”మీలో ఎవరు కోటిశ్వరుడు” కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను ఆహ్వానించారని అంటున్నారు. అంటే నాగ్ అభిమానులు తొలుత తమ అభిమాన హీరో సినిమా చూసేసి అనంతరం ”నాన్నకు ప్రేమతో” టికెట్‌ కొంటారన్న మాట.

Click to Read:

Tags:    
Advertisement

Similar News