పోటీ బాలయ్య " ఎన్టీఆర్ మధ్య కాదు
సంక్రాంతి రేసులో తెరపై బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ తెరవెనక చూస్తే… అసలైన పోటీ రెండు బడా సంస్థల మధ్య కనిపిస్తోంది. బాలయ్య నటించిన డిక్టేటర్ సినిమాను ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెరకెక్కించింది. అటు తారక్ చేసిన నాన్నకు ప్రేమతో సినిమాను రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. ఈ రెండు సినిమాలపై సదరు సంస్థలు భారీగా ఖర్చుపెట్టాయి. దాదాపు రెండు సినిమాలు 40కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కాయని సమాచారం. […]
Advertisement
సంక్రాంతి రేసులో తెరపై బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ తెరవెనక చూస్తే… అసలైన పోటీ రెండు బడా సంస్థల మధ్య కనిపిస్తోంది. బాలయ్య నటించిన డిక్టేటర్ సినిమాను ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెరకెక్కించింది. అటు తారక్ చేసిన నాన్నకు ప్రేమతో సినిమాను రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. ఈ రెండు సినిమాలపై సదరు సంస్థలు భారీగా ఖర్చుపెట్టాయి. దాదాపు రెండు సినిమాలు 40కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కాయని సమాచారం. ఈ నేపథ్యంలో…. తెరపై బాలయ్య-ఎన్టీఆర్ కత్తులు దూస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ…. ఆర్థిక లావాదేవీల విషయానికొస్తే…. ఎరోస్-రిలయన్స్ మధ్యే అసలైన పోటీ నడుస్తోంది. ఇప్పటికే తమ సినిమాలకు అదిరిపోయే రేంజ్ లో ప్రచారం కల్పిస్తున్నాయి ఈ రెండు బడా సంస్థలు. బాలీవుడ్ లో ఈ రెండు సంస్థల మధ్య ఇప్పటికే వార్ నడుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా పోటీ షురూ అయింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో రాబోతున్న ఈ సినిమాల్లో ఏది హిట్టవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటే…. ఎంత లాభం వస్తుందా అని ఈ సంస్థలు లెక్కలేసుకుంటున్నాయి.
Advertisement