టీఆర్ఎస్‌కు చుక్కలు చూపుతున్న మర్రి

మాజీ మంత్రి మర్రిశశిధర్ రెడ్డి టీఆర్ఎస్‌ను వెంటాడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టుల్లో సవాల్ చేస్తూ కొరకరాని కొయ్యగా మారారు. హైదరాబాద్ లో సీమాంధ్ర ఓటర్లను తొలగిస్తున్నారని హైకోర్టుకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన మర్రిశశిధర్ రెడ్డి అందులో వాస్తవాలు ఉన్నాయని కూడా నిరూపించగలిగారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను కుదిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా ఆయన న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. హైకోర్టు కూడా గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ కుదించడాన్ని తప్పుపట్టింది. టీఆర్ఎస్ […]

Advertisement
Update:2016-01-08 11:43 IST

మాజీ మంత్రి మర్రిశశిధర్ రెడ్డి టీఆర్ఎస్‌ను వెంటాడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను కోర్టుల్లో సవాల్ చేస్తూ కొరకరాని కొయ్యగా మారారు. హైదరాబాద్ లో సీమాంధ్ర ఓటర్లను తొలగిస్తున్నారని హైకోర్టుకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన మర్రిశశిధర్ రెడ్డి అందులో వాస్తవాలు ఉన్నాయని కూడా నిరూపించగలిగారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను కుదిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా ఆయన న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. హైకోర్టు కూడా గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ కుదించడాన్ని తప్పుపట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని మర్రి ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీలో సీమాంధ్రకు చెందిన వారి ఓట్ల తొలగింపు వ్యవహారంపై మర్రి శశిధర్‌ రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా ఆధారాలు కూడా సమర్పించారు. ఈ ఫిర్యాదులపై కేంద్ర ఎన్నిలక సంఘం క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. చివరికి జిహెచ్‌ఎంసి కమిషనర్‌ గా ఉన్న సోమేష్ కుమార్ పై వేటుపడేలా చేశారు.

2009లో సనత్ నగర్ ఎమ్మెల్యేగా మర్రిశశధర్ రెడ్డి గెలిచినా 2014 ఎన్నికల్లో ప్రస్తుతం మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన దృష్టంతా సొంత నియోకవర్గం సనత్ నగర్ పైనే కేంద్రీకరించారు. టీడీపీ ఎమ్మెల్యేగా పోటీచేసి టీఆర్ఎస్ లో చేరి మంత్రైన తలసానిపై కోర్టుకు వెళ్లారు. ఎన్నికల సంఘం, హైకోర్టు దగ్గర్నుంచి రాష్ట్రపతి వరకు అందరికీ ఫిర్యాదు చేశారు. గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి దానం నాగేందర్‌ ఉన్నప్పటికీ అధికార పార్టీని ఢీకొట్టడంతో శశిధర్‌ రెడ్డే ముందంజలో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News