2015-హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ ఎవరు ?
అనుష్క పడ్డ కష్టానికి, వచ్చిన ఫలితాలకి సంబంధం లేదు. ‘హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్’ అంటూ ఉంటారు కానీ ఇలాంటివి చూస్తే అందులో నిజం లేదనిపిస్తుంది. సైజ్ జీరో కోసమని తన ఇమేజ్‌ని లెక్క చేయకుండా ఎన్నో కిలోల బరువు పెరిగి డీ గ్లామరైజ్డ్‌గా కనిపించింది. కానీ ఆ చిత్ర దర్శకుడు కథ, కథనాల పరంగా చేసిన పొరపాట్ల కారణంగా స్వీటీ కష్టం వేస్టయిపోయింది. అలాగే ‘రుద్రమదేవి’ కోసం అనుష్క చాలా రోజుల పాటు శ్రమించింది. తన […]
Advertisement
అనుష్క పడ్డ కష్టానికి, వచ్చిన ఫలితాలకి సంబంధం లేదు. ‘హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్’ అంటూ ఉంటారు కానీ ఇలాంటివి చూస్తే అందులో నిజం లేదనిపిస్తుంది. సైజ్ జీరో కోసమని తన ఇమేజ్‌ని లెక్క చేయకుండా ఎన్నో కిలోల బరువు పెరిగి డీ గ్లామరైజ్డ్‌గా కనిపించింది. కానీ ఆ చిత్ర దర్శకుడు కథ, కథనాల పరంగా చేసిన పొరపాట్ల కారణంగా స్వీటీ కష్టం వేస్టయిపోయింది. అలాగే ‘రుద్రమదేవి’ కోసం అనుష్క చాలా రోజుల పాటు శ్రమించింది. తన శాయశక్తులా కష్టపడి రుద్రమ పాత్రకి జీవం పోసినా కానీ గుణశేఖర్ అంచనాలకి తగ్గ సినిమా తీయలేకపోయాడు. ఫలితంగా రుద్రమదేవి యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది తప్ప అనుష్కకి మరో అరుంధతిలాంటి విజయాన్ని మాత్రం అందించలేదు. అయితే బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర పోషించడం అనుష్కకి ఊరట. ఈ చిత్ర విజయంలో తన పాత్ర నామమాత్రమే అయినప్పటికీ ఒక చారిత్రిక విజయంలో భాగం పంచుకోగలిగింది.
Advertisement