శైలజతో చేతులు కలిపిన ఎన్టీఆర్

రామ్ నటించిన నేను శైలజ సినిమా ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఇప్పుడీ సినిమాతో యంగ్ టైగర్ చేతులు కలిపాడు. రామ్ నటించిన నేను శైలజ సినిమా ప్రదర్శితమౌతున్న ప్రతి థియేటర్ లో…. నాన్నకు ప్రేమతో థియేట్రికల్ ట్రయిలర్ ను ప్రసారం చేయాలనుకుంటున్నారు. అంతేకాదు… ఇప్పటివరకు నడుస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ… ట్రయిలర్ లో జనవరి 13 న విడుదల అనే విషయాన్ని పెద్దపెద్ద అక్షరాలతో చెప్పాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్రవంతి రవికిషోర్ […]

Advertisement
Update:2016-01-04 00:33 IST
రామ్ నటించిన నేను శైలజ సినిమా ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ఇప్పుడీ సినిమాతో యంగ్ టైగర్ చేతులు కలిపాడు. రామ్ నటించిన నేను శైలజ సినిమా ప్రదర్శితమౌతున్న ప్రతి థియేటర్ లో…. నాన్నకు ప్రేమతో థియేట్రికల్ ట్రయిలర్ ను ప్రసారం చేయాలనుకుంటున్నారు. అంతేకాదు… ఇప్పటివరకు నడుస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ… ట్రయిలర్ లో జనవరి 13 న విడుదల అనే విషయాన్ని పెద్దపెద్ద అక్షరాలతో చెప్పాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్రవంతి రవికిషోర్ తో…. నాన్నకు ప్రేమతో నిర్మాతలు చర్చలు సఫలం అయ్యాయి. ఈనెల 13న నాన్నకు ప్రేమతో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఆ సినిమా విడుదలైన 24 గంటల వ్యవధిలోనే బాలయ్య నటిస్తున్న డిక్టేటర్ కూడా వస్తోంది. దీంతో బాలయ్య కోసం ఎన్టీఆర్.. .బరి నుంచి తప్పుకోవచ్చనే ఊహాగానాలు సాగాయి. కానీ ఒకప్పట్లా బాబాయ్ కోసం తన సినిమా త్యాగం చేసే పొజిషన్ లో ఎన్టీఆర్ లేడు. అందుకే రూమర్లకు చెక్ చెప్పాలనుకుంటున్నాడు. పైగా ఇది తన 25వ సినిమా. కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ మూవీ. అందుకే ఆరు నూరైనా నాన్నకు ప్రేమతో సినిమాను సంక్రాంతి బరిలోకి దించాలనుకుంటున్నాడు. అందుకే మరింత క్లారిటీ కోసం నేను శైలజ సినిమాతో చేతులు కలిపాడు.
Tags:    
Advertisement

Similar News