కాజల్ మీద రామ్ కు ఎందుకంత కసి

రామ్-కాజల్ కలిసి ఒకేఒక్క సినిమా చేశారు. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమా సంగతి అటుంచితే ఇద్దరి మధ్య చెప్పుకోదగ్గ ఫ్రెండ్ షిప్ లేదు. అలా అని కత్తులుదూసుకునేంత వైరం కూడా లేదు. కానీ కాజల్ పై ఒక్కసారిగా పగ పెంచుకున్నాడు రామ్. ఆమెపై ఇండైరెక్ట్ గా కక్ష తీర్చుకున్నాడు. ఆ కక్షసాధింపు చర్యకు…. నేను శైలజ అనే తాజా చిత్రం వేదికైంది. సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ ను పొగిడే క్రమంలో…. కాజల్ […]

Advertisement
Update:2016-01-03 00:33 IST
రామ్-కాజల్ కలిసి ఒకేఒక్క సినిమా చేశారు. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమా సంగతి అటుంచితే ఇద్దరి మధ్య చెప్పుకోదగ్గ ఫ్రెండ్ షిప్ లేదు. అలా అని కత్తులుదూసుకునేంత వైరం కూడా లేదు. కానీ కాజల్ పై ఒక్కసారిగా పగ పెంచుకున్నాడు రామ్. ఆమెపై ఇండైరెక్ట్ గా కక్ష తీర్చుకున్నాడు. ఆ కక్షసాధింపు చర్యకు…. నేను శైలజ అనే తాజా చిత్రం వేదికైంది. సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ ను పొగిడే క్రమంలో…. కాజల్ పోస్టర్ ను చూపించి అంతకంటే బాగున్నావంటాడు రామ్. అంతేకాదు… కాజల్ ను యావరేజ్ ఫిగర్ గా లెక్కకడతాడు. ఓవైపు స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది కాజల్. అంతేకాదు…. పవన్ కల్యాణ్ సరసన కూడా నటిస్తోంది. ఇన్నేళ్లయినా ఆమెకు ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అలాంటి బ్యూటీని రామ్ విమర్శించడాన్ని కాజల్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Tags:    
Advertisement

Similar News