ఇంటికొచ్చిన విద్యాబాలన్

కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడిన విద్యాబాలన్ ఎట్టకేలకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. 4 రోజులుగా ముంబయిలోని హిందుజా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమెను డాక్టర్లు ఇంటికి పంపించేశారు. తీవ్రమైన వెన్నునొప్పితో గతనెల 29న హాస్పిటల్ లో జాయిన్ అయింది విద్యాబాలన్. వాస్తవానికి కొత్త ఏడాది సంబరాల్ని జరుపుకునేందుకు… భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ తో కలిసి న్యూయార్క్ వెళ్లాలనుకుంది విద్యాబాలన్. అయితే విమానం లోనే ఆమెకు వెన్నునొప్పి ఎక్కువైంది. దీంతో సిద్దార్థ్… వెంటనే టూర్ […]

Advertisement
Update:2016-01-03 00:33 IST
కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడిన విద్యాబాలన్ ఎట్టకేలకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. 4 రోజులుగా ముంబయిలోని హిందుజా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమెను డాక్టర్లు ఇంటికి పంపించేశారు. తీవ్రమైన వెన్నునొప్పితో గతనెల 29న హాస్పిటల్ లో జాయిన్ అయింది విద్యాబాలన్. వాస్తవానికి కొత్త ఏడాది సంబరాల్ని జరుపుకునేందుకు… భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ తో కలిసి న్యూయార్క్ వెళ్లాలనుకుంది విద్యాబాలన్. అయితే విమానం లోనే ఆమెకు వెన్నునొప్పి ఎక్కువైంది. దీంతో సిద్దార్థ్… వెంటనే టూర్ క్యాన్సిల్ చేసి ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. ఆమె కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. వెంటనే చికిత్స ప్రారంభించారు. అలా కొత్త ఏడాదిలో హాస్పిటల్ లో గడిపిన విద్యాబాలన్… ఎట్టకేలక పూర్తి ఆరోగ్యంతో ఇంటికెళ్లింది. కొన్ని రోజుల పాటు విదేశీ పర్యటనలు చేపట్టవద్దని డాక్టర్లు ఆమెకు సూచించారు.
Tags:    
Advertisement

Similar News