యాక్సిడెంట్ చేశారో... లైసన్స్ పోయినట్టే!
రోడ్డు ప్రమాదాలకు తరచూ కారణమయితే ఇక మీరు కోర్టు కేసులను ఎదుర్కోవడమే కాదు డ్రైవింగ్ లైసన్స్‌నూ కోల్పోతారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు తెలంగాణ రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పీ మహేందర్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతిమూడు నెలలకు ఒకసారి ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తరచూ ప్రమాదాలకు కారణమయ్యే వారి డ్రైవింగ్ లైసన్స్‌లను […]
Advertisement
రోడ్డు ప్రమాదాలకు తరచూ కారణమయితే ఇక మీరు కోర్టు కేసులను ఎదుర్కోవడమే కాదు డ్రైవింగ్ లైసన్స్‌నూ కోల్పోతారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు తెలంగాణ రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పీ మహేందర్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతిమూడు నెలలకు ఒకసారి ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తరచూ ప్రమాదాలకు కారణమయ్యే వారి డ్రైవింగ్ లైసన్స్‌లను రద్దు చేస్తామని మంత్రి అన్నారు. అవసరమైతే అమెరికాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అనుసరించే విధానాలను కూడా అమలుచేసేందుకు యోచిస్తున్నామన్నారు.
Advertisement