ఆ తప్పు తనే చేశానని ఒప్పుకున్న రామ్

సినిమా హిట్టయితే హీరో ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఫ్లాప్ అయితే దర్శకుడ్ని దోషిగా నిలబెట్టే సంప్రదాయం తెలుగు చిత్రసీమలో అనాదిగా ఉంది. వీవి వినాయక్, శ్రీనువైట్ల, శేఖర్ కమ్ముల, సురేందర్ రెడ్డి లాంటి ఎంతోమంది దర్శకులు ఇలాంటి అనుభవాలు చవిచూసినవాళ్లే. కానీ దీనికి రివర్స్ లో తప్పంతా నాదే అని ఒప్పుకున్నాడు హీరో రామ్. ఇతడు నటించిన తాజా చిత్రం శివమ్. ఈ సినిమా ఏ రేంజ్ లో ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. విడుదలైన రెండో రోజు […]

Advertisement
Update:2015-12-31 00:37 IST
సినిమా హిట్టయితే హీరో ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఫ్లాప్ అయితే దర్శకుడ్ని దోషిగా నిలబెట్టే సంప్రదాయం తెలుగు చిత్రసీమలో అనాదిగా ఉంది. వీవి వినాయక్, శ్రీనువైట్ల, శేఖర్ కమ్ముల, సురేందర్ రెడ్డి లాంటి ఎంతోమంది దర్శకులు ఇలాంటి అనుభవాలు చవిచూసినవాళ్లే. కానీ దీనికి రివర్స్ లో తప్పంతా నాదే అని ఒప్పుకున్నాడు హీరో రామ్. ఇతడు నటించిన తాజా చిత్రం శివమ్. ఈ సినిమా ఏ రేంజ్ లో ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. విడుదలైన రెండో రోజు నుంచే థియేటర్లన్నీ ఖాళీ. అట్టర్ ఫ్లాప్ అయిన ఈ సినిమాకు సంబంధించి దర్శకుడ్ని నిందించడం తగదంటున్నాడు హీరో రామ్. తప్పంతా తనదే అంటున్నాడు. ఆ సినిమాకు తెరవెనక కర్త, కర్మ, క్రియ అన్నీ తానే కాబట్టి… ఓటమికి బాధ్యత కూడా తనదే అని ఒప్పుకున్నాడు. ఇకపై సినిమా కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటానంటున్నాడు. అన్నట్టు రేపు విడుదలవుతున్న నేను శైలజ సినిమాకు కూడా తెరవెనక కర్త-కర్మ-క్రియ అన్నీ రామే. మరి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే… కొన్ని గంటలు ఆగాల్సిందే…
Tags:    
Advertisement

Similar News