పవన్ సినిమాకు డ్యాన్స్ మాస్టర్ దర్శకత్వం
జానీ మాస్టర్…. ఇండస్ట్రీలో మంచి పేరుప్రఖ్యాతులున్న డ్యాన్స్ మాస్టర్. పవన్ సినిమాకు ఇతడు మూమెంట్స్ కంపోజ్ చేస్తాడనడంలో ఆశ్చర్యం లేదు. కానీ షాకింగ్ న్యూస్ అది కాదు. పవన్ సినిమాకు జానీ మాస్టర్ దర్శకత్వం వహిస్తాడట. ఇదే ఇప్పుడు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయి కూర్చుంది. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ పనిలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ను జానీ మాస్టర్ కలిశాడట. అంతా ఏదో కొరియోగ్రఫీ ఆఫర్ కోసం వచ్చాడని అనుకున్నారట. కానీ జానీ […]
Advertisement
జానీ మాస్టర్…. ఇండస్ట్రీలో మంచి పేరుప్రఖ్యాతులున్న డ్యాన్స్ మాస్టర్. పవన్ సినిమాకు ఇతడు మూమెంట్స్ కంపోజ్ చేస్తాడనడంలో ఆశ్చర్యం లేదు. కానీ షాకింగ్ న్యూస్ అది కాదు. పవన్ సినిమాకు జానీ మాస్టర్ దర్శకత్వం వహిస్తాడట. ఇదే ఇప్పుడు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయి కూర్చుంది. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ పనిలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ను జానీ మాస్టర్ కలిశాడట. అంతా ఏదో కొరియోగ్రఫీ ఆఫర్ కోసం వచ్చాడని అనుకున్నారట. కానీ జానీ మాస్టర్ మాత్రం పవన్ కు ఏకంగా కథ వినిపించాడని సమాచారం. ఇదే ఒక బ్రేకింగ్ అనుకుంటే… పవన్ కల్యాణ్ ఆ కథను ఇష్టపడ్డాడనేది మరో బ్రేకింగ్. జానీ మాస్టర్ చెప్పిన స్టోరీలైన్ పవన్ కు బాగా నచ్చి…తన నెక్ట్స్ సినిమా నిర్మాత దాసరి నారాయణరావు వద్దకు జానీని పంపాడని తెలుస్తోంది. దీంతో పవన్ నెక్ట్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్న దర్శకుల సంఖ్య చాంతాడంత పెరిగిపోతోంది. ఇప్పటికే లిస్ట్ లో డాలీ, సంపత్ నంది ఉన్నారు. మరి… పవర్ స్టార్ ఎవరికి అవకాశమిస్తాడనేది చూడాలి.
Advertisement