నెట్ లో ఎన్టీఆర్ సంచలనం

మొన్నటివరకు ఇంటర్నెట్ లో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ మాత్రమే స్ట్రాంగ్ గా ఉండేవాళ్లు. వాళ్లకు మాత్రమే బలమైన ఫాలోయింగ్ కనిపించేది. ఇప్పుడీ సెగ్మెంట్ లోకి యంగ్ టైగర్ కూడా ఎంటరయ్యాడు. నాన్నకు ప్రేమతో ట్రయిలర్ దీనికి పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. థియేట్రికల్ ట్రయిలర్ విడుదలైన 36 గంటల్లోనే…. నాన్నకు ప్రేమతో 10లక్షల హిట్స్ సంపాదించింది. తారక్ కెరీర్ లోనే ఓ చిత్రానికి నెట్ లో ఇంతటి విశేష ఆదరణ లభించడం ఇదే తొలిసారి. […]

Advertisement
Update:2015-12-29 00:33 IST
మొన్నటివరకు ఇంటర్నెట్ లో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ మాత్రమే స్ట్రాంగ్ గా ఉండేవాళ్లు. వాళ్లకు మాత్రమే బలమైన ఫాలోయింగ్ కనిపించేది. ఇప్పుడీ సెగ్మెంట్ లోకి యంగ్ టైగర్ కూడా ఎంటరయ్యాడు. నాన్నకు ప్రేమతో ట్రయిలర్ దీనికి పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. థియేట్రికల్ ట్రయిలర్ విడుదలైన 36 గంటల్లోనే…. నాన్నకు ప్రేమతో 10లక్షల హిట్స్ సంపాదించింది. తారక్ కెరీర్ లోనే ఓ చిత్రానికి నెట్ లో ఇంతటి విశేష ఆదరణ లభించడం ఇదే తొలిసారి. మరోవైపు సినిమాను సంక్రాంతి స్పెషల్ గా జనవరి 13న విడుదల చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన చివరి పాటను కూడా తాజాగా కంప్లీట్ చేశారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో మూవీ ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. ఆ వెంటనే సెన్సార్ పూర్తిచేసి, సినిమా డిస్ట్రిబ్యూషన్ పనులు మొదలుపెడతారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏరియాస్ లో భారీ స్థాయిలో మార్కెట్ పూర్తయింది.
Tags:    
Advertisement

Similar News