హ్యాకింగ్ బారిన ప‌డ్డ జూనియ‌ర్ ఎన్టీఆర్‌!

జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాను ఎలాగైనా సంక్రాంతి బ‌రిలోకి రాకుండా కొన్ని దుష్ట‌శ‌క్తులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మొన్న‌టి దాకా ఎన్టీఆర్ సినిమాను విడుద‌ల‌కు ముందే బాగాలేద‌ని దుష్ప్ర‌చారం చేశారు. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ ఖాతాను హ్యాక్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. కొంత‌కాలంగా ప్ర‌ముఖుల వెబ్‌సైట్లు, హ్యాకింగ్ కు గుర‌వ‌తుండటం చూస్తున్నాం. కానీ, తొలిసారిగా తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన యువ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ట్విట‌ర్ ఖాతా హ్యాకింగ్ గుర‌వ‌డం టాలీవుడ్‌లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. […]

Advertisement
Update:2015-12-22 00:40 IST
జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాను ఎలాగైనా సంక్రాంతి బ‌రిలోకి రాకుండా కొన్ని దుష్ట‌శ‌క్తులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మొన్న‌టి దాకా ఎన్టీఆర్ సినిమాను విడుద‌ల‌కు ముందే బాగాలేద‌ని దుష్ప్ర‌చారం చేశారు. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ ఖాతాను హ్యాక్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. కొంత‌కాలంగా ప్ర‌ముఖుల వెబ్‌సైట్లు, హ్యాకింగ్ కు గుర‌వ‌తుండటం చూస్తున్నాం. కానీ, తొలిసారిగా తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన యువ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ట్విట‌ర్ ఖాతా హ్యాకింగ్ గుర‌వ‌డం టాలీవుడ్‌లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ‘నా సినిమా నాన్న‌కు ప్రేమ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌ని అభిమానులు అడుగుతున్నారు’. ‘సినిమాలో ఏం జ‌రుగుతుందో నాకే తెలియ‌డం లేదు’ అని ఎన్టీఆర్ వాపోయిన‌ట్లు పోస్టు పెట్టారు. ఇది త‌ర‌చుగా డిలిట్ అవుతూ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతూ క‌నిపించ‌డంతో అభిమానుల్లో ఆందోళ‌న రేగింది. ఈ విష‌యం తెలుసుకున్న ఎన్టీఆర్ ‘త‌న అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంద‌ని ప్ర‌క‌టించాడు. దీన్ని క‌నిపెట్టేందుకు త‌న టీం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని, స‌మ‌స్య ప‌రిష్కారం కాగానే అభిమానుల‌కు ట‌చ్‌లోకి వ‌స్తా’ను అని ట్వీట్ చేశాడు.
ఇది కూడా వారి ప‌నేనా?
జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న సినిమా నాన్న‌కు ప్రేమ‌తోపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. అందుకే రాత్రి ప‌గ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాను సంక్రాంతి బ‌రిలో నిల‌పాల‌ని ఆశ‌ప‌డుతున్న ఎన్టీఆర్‌కు అడుగడుగునా కొంద‌రు అజ్ఞాత వ్య‌క్తులు, శ‌క్తులు అడ్డుప‌డుతున్నారు. బ‌య్య‌ర్ల‌ను, డిస్ర్టిబ్యూట‌ర్ల‌ను సినిమా కొన‌వ‌ద్ద‌ని ఒత్తిడి తీసుకువ‌స్తున్న‌ట్లు తెలిసింది. పైగా సినిమా బాగాలేద‌ని ఇచ్చిన అడ్వాన్సులు వెన‌క్కి తీసుకోవాల‌ని బ‌య్య‌ర్ల‌ను వేధిస్తున్నార‌ని స‌మాచారం. సినిమాపై రోజుకో ర‌కం పుకారు తీసుకువ‌స్తున్నారు. ఇప్పుడు ఏకంగా హ్యాకింగ్ పాల్ప‌డి సినిమాపై మ‌రోసారి బుర‌ద జ‌ల్లేయ‌త్నం చేశారు. దీనిపై జూనియ‌ర్ సైబ‌ర్ పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తే.. నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డం పెద్ద ప‌ని కాదు.
Tags:    
Advertisement

Similar News