షారుక్ కు యాక్టింగ్ రాదా ?

రెండు దశాబ్దాలకుపైగా కెరీర్‌లో ఎన్నో సినిమాలతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ఖాన్‌. ఆయనకు ఇటీవల ఓ అభిమాని నుంచి ఊహించని షాక్‌ ఎదురైంది. షారుఖ్‌ తాజా సినిమా ‘దిల్‌వాలే’ను చూసిన ఓ అభిమాని.. ‘మీరెప్పుడు నటన నేర్చుకుంటారు’ అంటూ ఆయనను నేరుగా అడిగారు. ఊహించని ఈ ప్రశ్నకు షారుఖ్‌ నింపాదిగానే సమాధానమిచ్చారు. నటుడిగా కొనసాగేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ఫార్ములాలు ఉండవని, చనిపోయేవరకు కూడా తాను నటనను నేర్చుకోలేనని ఆయన పేర్కొన్నారు. ఇటీవల […]

Advertisement
Update:2015-12-22 00:42 IST

రెండు దశాబ్దాలకుపైగా కెరీర్‌లో ఎన్నో సినిమాలతో, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ఖాన్‌. ఆయనకు ఇటీవల ఓ అభిమాని నుంచి ఊహించని షాక్‌ ఎదురైంది. షారుఖ్‌ తాజా సినిమా ‘దిల్‌వాలే’ను చూసిన ఓ అభిమాని.. ‘మీరెప్పుడు నటన నేర్చుకుంటారు’ అంటూ ఆయనను నేరుగా అడిగారు. ఊహించని ఈ ప్రశ్నకు షారుఖ్‌ నింపాదిగానే సమాధానమిచ్చారు. నటుడిగా కొనసాగేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ఫార్ములాలు ఉండవని, చనిపోయేవరకు కూడా తాను నటనను నేర్చుకోలేనని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కింగ్‌ ఖాన్‌ అభిమానులతో ట్విట్టర్‌లో ముచ్చటించిన సందర్భంగా ఇది చోటుచేసుకుంది. షారుఖ్‌ తాజా సినిమా ‘దిల్‌వాలే’కు కలెక్షన్లు జోరుగా ఉన్నా సినీ సమీక్షుల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది.

ఈ ట్విట్టర్ చాటింగ్‌లో ‘దిల్‌వాలే’ గురించి అభిమానులు భిన్నమైన స్పందన వ్యక్తం చేశారు. మీరు ఇలాంటి సినిమాలే చేస్తూ పోతే మీకున్న అభిమానబలం తగ్గిపోక తప్పదని ఓ నెటిజన్‌ అభిప్రాయపడగా.. నటుడిగా తాను ఒక మూసలో ఒదిగిపోనని, అన్ని రకాల పాత్రలు చేస్తానని షారుఖ్‌ రిప్లై ఇచ్చాడు. ఐఐఎం వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఉపన్యాసాలు ఇవ్వడంపై స్పందిస్తూ ‘నా ఉపన్యాసాలు ప్రేరణ కలిగించేందుకు, సినిమాలు వినోదం కలిగించేందుకు, రెండింటిని మిక్స్ చేయవద్దు’ అని బదులిచ్చాడు.

Tags:    
Advertisement

Similar News