ఎన్టీఆర్ హెయిర్ స్టయిల్ ఇక్కడిది కాదు
అవును… ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించాడు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ హెయిర్ స్టయిల్ తో కనిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ షెడ్యూల్ ఒకటి రీసెంట్ గా స్పెయిన్ లో పూర్తయింది. షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ వచ్చిన తారక్… ఓ ప్రైవేటు ఫంక్షన్ లో పాల్గొన్నాడు. అక్కడ తన అభిమానులతో ముచ్చటించిన ఈ స్టార్ హీరో…. సినిమాలో తన కేశాలంకరణకు సంబంధించిన రహస్యాన్ని వాళ్లకు చెప్పేశాడు. హెయిర్ స్టయిల్ లోనే […]
Advertisement
అవును… ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించాడు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ హెయిర్ స్టయిల్ తో కనిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ షెడ్యూల్ ఒకటి రీసెంట్ గా స్పెయిన్ లో పూర్తయింది. షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ వచ్చిన తారక్… ఓ ప్రైవేటు ఫంక్షన్ లో పాల్గొన్నాడు. అక్కడ తన అభిమానులతో ముచ్చటించిన ఈ స్టార్ హీరో…. సినిమాలో తన కేశాలంకరణకు సంబంధించిన రహస్యాన్ని వాళ్లకు చెప్పేశాడు. హెయిర్ స్టయిల్ లోనే కథ కూడా ఉందని ఊరిస్తూ చెప్పాడు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్…. ఎన్నారై కుర్రాడిగా కనిపిస్తాడట. లండన్ లోనే పుట్టిపెరిగిన అబ్బాయిగా కనిపిస్తాడట. అందుకే అక్కడి హెయిర్ స్టయిల్ ను ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో… ప్రస్తుతం బ్రిటన్ దేశంలో ఎక్కువగా యూత్ ఫాలో అవుతున్న హెయిర్ కట్ పై పెద్ద రీసెర్చ్ చేశారట. అలా ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాతే ప్రస్తుతం నడుస్తున్న హెయిర్ స్టయిల్ ను ఫాలో అవుతున్నామని ప్రకటించాడు ఎన్టీఆర్. అంటే… ఎన్టీఆర్ హెయిర్ స్టయిల్…. ఇండియన్ ట్రెండ్ కాదన్నమాట…. బ్రిటన్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నాడన్నమాట. ప్రస్తుతానికైతే నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించి.. ఈ ఒక్క విషయాన్నే బయటపెట్టిన తారక్, ఆడియో ఫంక్షన్ లో మరిన్ని విశేషాలు చెబుతానని మాటిచ్చాడు.
Advertisement