మొదటిసారి వార్నింగ్ ఇచ్చిన రవితేజ

కథ, స్క్రీన్ ప్లే, పారితోషికం సెట్ అయితే చాలు…. ఇంకే విషయాలు పట్టించుకోడు రవితేజ. నేరుగా సెట్స్ పైకి వెళ్లిపోతాడు. బల్క్ గా కాల్షీట్లు కేటాయిస్తాడు. సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేంతవరకు అదే పనిలో ఉంటాడు. కానీ తొలిసారి రవితేజ మనసు మార్చుకున్నాడు. కథ, కథనానికి ఓకే చెప్పి…. సెట్స్ పైకి వెళ్లిన తర్వాత ఓ స్క్రిప్ట్ లో మార్పులు డిమాండ్ చేశాడు. ఆ సినిమా పేరు ఎవడో ఒకడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు […]

Advertisement
Update:2015-12-18 00:36 IST

కథ, స్క్రీన్ ప్లే, పారితోషికం సెట్ అయితే చాలు…. ఇంకే విషయాలు పట్టించుకోడు రవితేజ. నేరుగా సెట్స్ పైకి వెళ్లిపోతాడు. బల్క్ గా కాల్షీట్లు కేటాయిస్తాడు. సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేంతవరకు అదే పనిలో ఉంటాడు. కానీ తొలిసారి రవితేజ మనసు మార్చుకున్నాడు. కథ, కథనానికి ఓకే చెప్పి…. సెట్స్ పైకి వెళ్లిన తర్వాత ఓ స్క్రిప్ట్ లో మార్పులు డిమాండ్ చేశాడు. ఆ సినిమా పేరు ఎవడో ఒకడు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో, దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నాడు రవితేజ. సినిమా కూడా ఈ మధ్యే ప్రారంభమైంది. అయితే అనుకోకుండా ఒక రోజు దర్శకుడు వేణి శ్రీరామ్ ను పిలిచిన రవితేజ…. సినిమాలో రెండో భాగం మొత్తాన్ని మార్చమని పురమాయించాడట. సినిమాలో ఫస్టాఫ్ ఉన్నంత వేగంగా… సెకండాఫ్ లో స్పీడ్ కనిపించలేదని…తన బాడీలాంగ్వేజ్ కు తగ్గట్టు మొత్తం మార్చుకు రమ్మని చెప్పాడట. దీంతో అంతా షాకయ్యారు. మరి ఈ తాజా పరిణామంపై నిర్మాత దిల్ రాజు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Tags:    
Advertisement

Similar News