ప్ర‌భాస్ అందుకే త‌ప్పుకున్నాడా?

 ఛ‌త్ర‌ప‌తి సినిమాలో ప్ర‌భాస్‌ను కొత్త‌గా, మేన్లీగా చూపించాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. అప్ప‌ట్లో ప్ర‌భాస్ కోసం చాలా  రోజులు ఆగి మ‌రీ  ఛ‌త్ర‌ప‌తి సినిమాను చేశాడు రాజ‌మౌళి. ఆ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డంతో వీరిద్ద‌రూ మంచి స్నేహితుల‌య్యారు. ఆ స్నేహంతోనే మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి బాహుబ‌లి-1 చేశారు.ఈ చిత్రానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూళ్ల సునామీ కురిసిన సంగ‌తి తెలిసిందే! బాహుబ‌లికి కొన‌సాగింపుగా తీస్తున్న‌ పార్ట్‌-2లోనూ ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. అయితే, బాహుబ‌లి-3లో ప్ర‌భాస్ ఉండ‌డ‌ని ఇటీవ‌ల క‌థా-ర‌చ‌యిత విజ‌యేంద్ర […]

Advertisement
Update:2015-12-18 04:37 IST
ఛ‌త్ర‌ప‌తి సినిమాలో ప్ర‌భాస్‌ను కొత్త‌గా, మేన్లీగా చూపించాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. అప్ప‌ట్లో ప్ర‌భాస్ కోసం చాలా రోజులు ఆగి మ‌రీ ఛ‌త్ర‌ప‌తి సినిమాను చేశాడు రాజ‌మౌళి. ఆ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డంతో వీరిద్ద‌రూ మంచి స్నేహితుల‌య్యారు. ఆ స్నేహంతోనే మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి బాహుబ‌లి-1 చేశారు.ఈ చిత్రానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూళ్ల సునామీ కురిసిన సంగ‌తి తెలిసిందే! బాహుబ‌లికి కొన‌సాగింపుగా తీస్తున్న‌ పార్ట్‌-2లోనూ ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. అయితే, బాహుబ‌లి-3లో ప్ర‌భాస్ ఉండ‌డ‌ని ఇటీవ‌ల క‌థా-ర‌చ‌యిత విజ‌యేంద్ర వ‌ర్మ ప్ర‌క‌టించాడు. ఇది అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేస్తోంది. కానీ, దీని వెన‌క చాలా కార‌ణాలే ఉన్నాయి.
కార‌ణాలు ఇవి!
1. బాహుబ‌లి కోసం ప్ర‌భాస్ త‌న కెరీర్‌లో 3 ఏళ్లు వ‌దులుకున్నాడు. కానీ, రాజ‌మౌళికి అత‌ని కంటే ఎక్కువ పేరు వ‌చ్చింది.
2. పార్ట్‌-2కి మ‌రో రెండేళ్లు ప‌ట్టేట్టు ఉంది. ఇక పార్ట్‌-3కి మ‌రింత స‌మ‌యం ప‌డుతుంది.
3. ఇప్ప‌టికే ప్ర‌భాస్ చాలా సినిమాలు క‌మిట్ అయ్యాడు. వాటికి న్యాయం చేయాలంటే బాహుబ‌లి సీరిస్‌లో ఉండ‌కూడ‌దు.
4. ఒకే ఫార్మాట్ సినిమాలను సుదీర్ఘ‌కాలం తీస్తే.. ప్ర‌తిసారీ విజ‌యాలు సాధిస్తాయ‌న్న న‌మ్మ‌కం లేదు.
5. వైవిధ్య‌మున్న పాత్ర‌లు వేసే అవ‌కాశాలు కోల్పోతున్నాన‌న్న బాధ ప్ర‌భాస్‌లో ఇప్ప‌టికే పెరిగిపోతోంది.
Tags:    
Advertisement

Similar News