శిక్ష తప్పించుకున్న సల్మాన్ కారు జింక నడిపిందా ?

తాగిన మైకంలో కారు నడిపి 2002 సెప్టెంబర్ 28న ముంబై లోని బాంద్రా రోడ్డులో ఒక వ్యక్తి మృతికి కారకుడైన సల్మాన్ పై ఆరోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందువల్ల సల్మాన్ శిక్ష తప్పించుకున్నారు. ఒక వ్యక్తి ఈ సంఘటనలో మరణించాడనడానికి రుజువులు అవసరం లేదు కాని ఆ వ్యక్తి మరణానికి కారణమైన కారు ఎవరు నడిపారో మాత్రం తేలలేదు. ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపించ లేక పోయింది కనుక కారు ఎవరు నడిపారన్న విషయంలో కచ్చితమైన […]

Advertisement
Update:2015-12-17 02:39 IST

తాగిన మైకంలో కారు నడిపి 2002 సెప్టెంబర్ 28న ముంబై లోని బాంద్రా రోడ్డులో ఒక వ్యక్తి మృతికి కారకుడైన సల్మాన్ పై ఆరోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందువల్ల సల్మాన్ శిక్ష తప్పించుకున్నారు. ఒక వ్యక్తి ఈ సంఘటనలో మరణించాడనడానికి రుజువులు అవసరం లేదు కాని ఆ వ్యక్తి మరణానికి కారణమైన కారు ఎవరు నడిపారో మాత్రం తేలలేదు. ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపించ లేక పోయింది కనుక కారు ఎవరు నడిపారన్న విషయంలో కచ్చితమైన నిర్ధారణకు రాలేమని ముంబై హైకోర్టు భావించింది. కోర్టు వెలువరించిన 305 పేజీల ఉత్తర్వులు బుధవారం నాడు వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చింది. సల్మాన్ మీద ఉన్న అన్ని ఆరోపణల నుంచి విముక్తి కలిగించిన ఉత్తర్వులు వెలువరించిన ఆరు రోజులకు దాని ప్రతి వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చింది. తగిన సాక్ష్యాధారాలను అందించనందువల్ల పరిస్థితుల ఆధారంగా కోర్టు సల్మాన్ ను నిర్దోషిగా తేల్చింది.

ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న నరుల్లా కారు ఢీకొనడం వల్ల మరణించిన మాట వాస్తవమే కాని కారు సల్మానే నడిపారా, ఆ సమయంలో ఆయన తాగిన మైకంలో ఉన్నారో లేదో తేల్చడానికి కావాల్సిన ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించనందువల్ల కారు ఎవరు నడిపారో నిర్ధారించలేమని న్యాయమూర్తి జోషి అభిప్రాయపడ్డారు.

నిందితుడు దోషి అవునో కాదో నిర్ధారించడానికి తగినన్ని సాక్ష్యాధారాలు లేనందువల్ల సల్మాన్ దోషి అని చెప్పలేమని న్యాయమూర్తి భావించారు. ఈ సంఘటనలో గాయపడ్డవారి, పోలీసు అధికారి సాక్ష్యాలలో వ్యత్యాసాలున్నాయని న్యాయమూర్తి చెప్పారు. ప్రాసిక్యూషన్ దృష్టిలో ఈ లోపాలు చిన్నవే అయినా కోర్టు వీటిని విస్మరించలేదని న్యాయమూర్తి తమ ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఈ తీర్పు విషయంలో పలువురు ఎంపీలు న్యాయవ్యవస్థపై ధ్వజమెత్తారు. “చట్టం తెలిసినవాడు మంచి లాయర్‌. జడ్జి తెలిసినవాడు గొప్ప లాయర్‌” అని బీజేపీ ఎంపీ కీర్తి అజాద్‌ కామెంట్‌ చేశాడు. జంతువును చంపినవాడు జైలుకు వెళుతున్నాడు. మనిషిని చంపినవాడు నిర్దోషిగా విడుదలవుతున్నాడు. ఇదీ మన న్యాయవ్యవస్థ పనిచేస్తున్న తీరు. అని ఆయన ధ్వజమెత్తాడు. మరి ఈ ప్రమాదం జరిగినపుడు కారును సల్మాన్‌ నడుపుతుండకపోతె బహుశా జింకడ్రైవ్‌ చేస్తూ ఉండవచ్చు అని అజాద్‌ న్యాయవ్యవస్థమీద వ్యంగ్య బాణాలు విసిరాడు.

Tags:    
Advertisement

Similar News