తమన్నాకు ఇంకా సీన్ మిగిలే ఉంది ?

బాహుబలి పార్ట్-1లో తమన్నానే హీరోయిన్ గా కనిపించింది. ఓ వైపు కత్తిపత్తి మాస్ యాంగిల్ లో కనిపిస్తూనే…. మరోవైపు అదిరిపోయే అందాలతో శృంగారభరితంగానూ ఆకట్టుకుంది. అయితే పార్ట్-2లో విషయం అంతా అనుష్కదే అనే విషయం అందరికీ తెలుసు. ఆ విషయాన్ని రాజమౌళి కూడా స్పష్టంచేశాడు. దీంతో తమన్న కూడా మెంటల్లీ ప్రిపేర్ అయిపోయింది. తనకిక పార్ట్-2లో నటించే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయింది. ఇంతలోనే రాజమౌళి, మిల్కీబ్యూటీకి ఊహించని అవకాశమిచ్చాడు. బాహుబలి పార్ట్-2లో కూడా తమన్నాను కొనసాగిస్తున్నాడు. […]

Advertisement
Update:2015-12-16 00:34 IST
తమన్నాకు ఇంకా సీన్ మిగిలే ఉంది ?
  • whatsapp icon
బాహుబలి పార్ట్-1లో తమన్నానే హీరోయిన్ గా కనిపించింది. ఓ వైపు కత్తిపత్తి మాస్ యాంగిల్ లో కనిపిస్తూనే…. మరోవైపు అదిరిపోయే అందాలతో శృంగారభరితంగానూ ఆకట్టుకుంది. అయితే పార్ట్-2లో విషయం అంతా అనుష్కదే అనే విషయం అందరికీ తెలుసు. ఆ విషయాన్ని రాజమౌళి కూడా స్పష్టంచేశాడు. దీంతో తమన్న కూడా మెంటల్లీ ప్రిపేర్ అయిపోయింది. తనకిక పార్ట్-2లో నటించే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయింది. ఇంతలోనే రాజమౌళి, మిల్కీబ్యూటీకి ఊహించని అవకాశమిచ్చాడు. బాహుబలి పార్ట్-2లో కూడా తమన్నాను కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తమన్నా ప్రకటించింది. పార్ట్-1తో అయిపోయిందనుకున్న తన పాత్రను… పార్ట్-2లో కూడా కొద్దిగా చూపిస్తారని తమన్నా స్పష్టంచేసింది. అయితే సినిమాలో ఎక్కువ భాగం అనుష్కానే కనిపిస్తుందని కూడా ప్రకటించింది. మొత్తమ్మీద బాహుబలి రెండు భాగాల్లో తమన్నాకు భాగం దక్కడం మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ కు ఆనందకర విషయం. మరోవైపు బాహుబలి పార్ట్-2 షూటింగ్ ను 40శాతం కంప్లీట్ చేశాడు రాజమౌళి. మూవీని 2016 డిసెంబర్ లోనే విడుదల చేయాలని మొదట అనుకున్నప్పటికీ… 2017 సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు.
Tags:    
Advertisement

Similar News