ఎన్టీఆర్ సినిమాను తొక్కేసే ప్ర‌య‌త్నాలు!

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ప్ర‌స్తుతం క‌ష్ట‌కాలం న‌డుస్తోంది. వ‌రుస ఫ్లాపుల త‌రువాత వ‌చ్చిన టెంప‌ర్ సినిమా ఊర‌టనిచ్చినా.. వ‌సూళ్ల ప‌రంగా నిరాశ‌నే మిగిల్చింది. దీంతో నాన్న‌కు ప్రేమతో చిత్రంపై బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేసే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ఈ సినిమాను తొక్కేసే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌వ‌డం విశేషం. సినిమాను కొనొద్దంటూ పంపిణీదారుల‌తో ఓ వ‌ర్గం వ్య‌క్తులు పైర‌వీలు న‌డుపుతున్నార‌ని స‌మాచారం. సినిమా బాలేదంటూ దుష్ప్ర‌చారం చేస్తూ.. ఇచ్చిన‌ అడ్వాన్సులు వెన‌క్కి తీసుకోవాలంటూ […]

Advertisement
Update:2015-12-16 00:36 IST
జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ప్ర‌స్తుతం క‌ష్ట‌కాలం న‌డుస్తోంది. వ‌రుస ఫ్లాపుల త‌రువాత వ‌చ్చిన టెంప‌ర్ సినిమా ఊర‌టనిచ్చినా.. వ‌సూళ్ల ప‌రంగా నిరాశ‌నే మిగిల్చింది. దీంతో నాన్న‌కు ప్రేమతో చిత్రంపై బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేసే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ఈ సినిమాను తొక్కేసే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌వ‌డం విశేషం. సినిమాను కొనొద్దంటూ పంపిణీదారుల‌తో ఓ వ‌ర్గం వ్య‌క్తులు పైర‌వీలు న‌డుపుతున్నార‌ని స‌మాచారం. సినిమా బాలేదంటూ దుష్ప్ర‌చారం చేస్తూ.. ఇచ్చిన‌ అడ్వాన్సులు వెన‌క్కి తీసుకోవాలంటూ బ‌య్య‌ర్ల‌పై ఒత్తిడి తెస్తున్నార‌ని స‌మాచారం. అంతేకాదు, సినిమా సంక్రాంతి బ‌రిలో నుంచి త‌ప్పుకోవాలంటూ ఉచిత స‌ల‌హాలు కూడా ఇస్తున్నార‌ట‌.
విడుద‌ల‌కు ముందే రూ.60 కోట్ల బిజినెస్ రాదా?
ఈ సినిమాను హై-ఫై రేంజ్‌లో, అత్యంత రిచ్ లుక్‌తో, ఉన్న‌త సాంకేతిక విలువ‌ల‌తో తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుకుమార్‌. ఎన్టీఆర్ లుక్ కూడా కొత్త‌గా ఉంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌ను దాదాపు 50 ల‌క్ష‌ల‌మంది వీక్షించారు. దీంతో సినిమా విడుద‌ల‌కు ముందే దాదాపు రూ.60 కోట్లు బిజినెస్ చేయాల‌ని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పుడు సినిమాను తొక్కేయాలంటూ ఓ వ‌ర్గం చేస్తున్న ప్ర‌య‌త్నాలు సినిమా బిజినెస్‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్టీఆర్ టెంప‌ర్‌, క‌ల్యాణ్‌రామ్ ప‌టాస్ సినిమాలు సూప‌ర్ హిట్లే! కానీ, ఆ సినిమాల‌ విడుద‌ల‌కు నానా క‌ష్టాలు ప‌డాల్సి వ‌చ్చింది. రిలీజ‌య్యాక థియేట‌ర్ల దొర‌క‌డం క‌ష్టంగానే మారింది. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న‌ నాన్న‌కు ప్రేమతో సినిమాకూ ఇలాంటి క‌ష్టాలే ఎదురైతే సినిమా హిట్ట‌యినా.. వ‌సూళ్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. టెంప‌ర్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది.
Tags:    
Advertisement

Similar News