బర్త్ డే బాయ్ రానా కు హీరోయిన్ల ప్రశంసల వర్షం
టాలీవుడ్ కండల వీరుడు ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు రానా దగ్గుబాటి. ఆరు అడుగులకు పైగా ఎత్తుతో.. బాహుబలి సినిమాలో తన భారీకాయాన్ని మరింత భారీగా ప్రదర్శించి అభిమానుల అంచనాలను అందుకున్న రానా సోమవారం తన పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. దీంతో పలువురు హీరోయిన్లు శుభాకాంక్షలతో రానాను ముంచెత్తారు. ఇటీవల చెన్నై వరదల సందర్భంగా ‘మన మద్రాస్ కోసం’ అంటూ రామానాయుడు స్టూడియోస్ కేంద్రంగా ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేసి వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సహాయ సామగ్రిని […]
టాలీవుడ్ కండల వీరుడు ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు రానా దగ్గుబాటి. ఆరు అడుగులకు పైగా ఎత్తుతో.. బాహుబలి సినిమాలో తన భారీకాయాన్ని మరింత భారీగా ప్రదర్శించి అభిమానుల అంచనాలను అందుకున్న రానా సోమవారం తన పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. దీంతో పలువురు హీరోయిన్లు శుభాకాంక్షలతో రానాను ముంచెత్తారు. ఇటీవల చెన్నై వరదల సందర్భంగా ‘మన మద్రాస్ కోసం’ అంటూ రామానాయుడు స్టూడియోస్ కేంద్రంగా ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేసి వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సహాయ సామగ్రిని అక్కడి నుంచి చెన్నైకి పంపడంలో సమన్వయం చేసిన రానా.. అక్కడి సమాచారాన్ని కూడా ఇక్కడి వాళ్లకు తెలియజేశాడు.
అందరికంటే ముందుగా సమంత పొద్దున్నే తన విషెస్‌ను పోస్ట్ చేసింది. మానవత్వం ఉన్న మంచి మనిషి, అందరితో సరదాగా ఉండే రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలని తెలిపింది. ఆ తర్వాత వరుసపెట్టి హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, రెజినా కాసాండ్రా, మంచు లక్ష్మి కూడా రానాకు బర్త్‌డే విషెస్ పోస్ట్ చేశారు. హీరో రామ్, అల్లు శిరీష్, బాహుబలి సినిమా యూనిట్ కూడా దగ్గుబాటి హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాహుబలి చిత్రంలో భళ్లాల దేవ పాత్ర కు రానా వందకు వంద శాతం సరిపోవడం.. సినిమా యావత్ దేశాన్ని కుదిపేయడం. వెరసి రానా కు కెరీర్ పరంగా హై టైగ్ నడుస్తుందనే చెప్పాలి. రానా మంచి చిత్రాలతో పది కాలల పాటు ఆడియన్స్ ను అలరించాలని కోరుకుందాం.