నాన్నకు ప్రేమతో సంక్రాంతికి వచ్చేనా?
సంక్రాంతి బరిలో అందరికంటే ముందే కర్చీఫ్ వేసుకున్న సినిమా నాన్నకు ప్రేమతో! సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమా విడుదలయ్యేనాటికి బాలయ్య చిత్రం- డిక్టేటర్ పోటీ ఉంటుందన్న విషయం తెలిసిందే! ప్రస్తుత పరిస్థితుల్లో సంక్రాంతి నాటికి ఈ సినిమా వచ్చే సూచనలు కనిపించడం లేదు. చిత్రం ఇంకా షూటింగ్ జరుపుకొంటుండటమే ఇందుకు కారణం. మరో మూడు వారాలపాటు టాకీ పార్టు చిత్రీకరించాల్సి ఉందని […]
Advertisement
సంక్రాంతి బరిలో అందరికంటే ముందే కర్చీఫ్ వేసుకున్న సినిమా నాన్నకు ప్రేమతో! సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమా విడుదలయ్యేనాటికి బాలయ్య చిత్రం- డిక్టేటర్ పోటీ ఉంటుందన్న విషయం తెలిసిందే! ప్రస్తుత పరిస్థితుల్లో సంక్రాంతి నాటికి ఈ సినిమా వచ్చే సూచనలు కనిపించడం లేదు. చిత్రం ఇంకా షూటింగ్ జరుపుకొంటుండటమే ఇందుకు కారణం. మరో మూడు వారాలపాటు టాకీ పార్టు చిత్రీకరించాల్సి ఉందని ఫిలింనగర్ టాక్. అంటే దాదాపు డిసెంబరు చివరి వారం దాకా సినిమా చిత్రీకరణ జరుగుతుంది. తరువాత ఎడిటింగ్, డబ్బింగ్, రీ-రికార్డింగ్ తదితర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎంతలేదన్నా రెండు, మూడు వారాలు పడుతుంది. మరి ఇంత పని జరగాల్సి ఉండగా సినిమా సంక్రాంతి నాటికి సిద్ధమవుతుందా? లేదా? అన్న విషయంలో సందిగ్ధం నెలకొంది.
అభిమానులు ఢీలా!
జూనియర్ సంక్రాంతికి సందడి చేస్తాడనుకుంటే.. ఇంకా స్పెయిన్‌లోనే చిత్రీకరణలో తలమునకలయ్యాడు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలే బాబాయ్ చిత్రానికి పోటీగా నాన్నకు ప్రేమతో సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందన్న ప్రచారం జరిగిపోయింది. ఈ విషయాన్ని అభిమానులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్రం విడుదల ఏమాత్రం జాప్యమైనా బాబాయ్‌కి భయపడి వెనకడుగు వేశాడన్న అపవాదు వస్తుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement