బర్ధన్ పరిస్థితి విషమం
సీపీఐ సీనియర్ నాయకుడు ఏ.బి.బర్ధన్ (అర్ధేందు భూషన్ బర్ధన్) సోమవారం ఉదయం పక్షవాతానికి గురయ్యారు. ఆయనకు 92 ఏళ్లు. ఆయన ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయం అజయ్ భవన్ లోనే నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. ఆయన స్పృహలో లేరు. బర్ధన్ పరిస్థితి విషమంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అతుల్ కుమార్ అంజన్ తెలియజేశారు. బర్ధన్ భార్య నాగపూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ […]
సీపీఐ సీనియర్ నాయకుడు ఏ.బి.బర్ధన్ (అర్ధేందు భూషన్ బర్ధన్) సోమవారం ఉదయం పక్షవాతానికి గురయ్యారు. ఆయనకు 92 ఏళ్లు. ఆయన ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయం అజయ్ భవన్ లోనే నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. ఆయన స్పృహలో లేరు. బర్ధన్ పరిస్థితి విషమంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అతుల్ కుమార్ అంజన్ తెలియజేశారు.
బర్ధన్ భార్య నాగపూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉండే వారు. ఆమె 1986లో మృతి చెందారు. వారికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. బర్ధన్ లబ్ధ ప్రతిష్టుడైన కార్మిక నాయకుడు. 1957లో ఆయన మహారాష్ట్ర శాసన సభకు ఇండిపెండెంటు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. చాలా కాలం పాటు ఆయన ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత సీపీఐ ప్రధాన కార్యదర్శిగా 1996లో ఎన్నికయ్యారు.