జనతా గ్యారేజీకి భాషాకి సంబంధమేమిటి?
కొంతకాలంగా సినిమాలు చిత్రీకరణలో ఉండగానే కథలు లీక్ అవుతున్నాయి. వీటిలో చాలామటుకు ప్రచారం కోసం చిత్ర యూనిట్ సభ్యులే లీక్ చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా కొరటాల-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న జనతా గ్యారేజీ కథ లీక్ అయిందని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కూడా భాషా సినిమాను పోలి ఉంటుందన్న పుకారు ఇండస్ట్రీలో బయల్దేరింది. భాషా సినిమా దక్షిణ భారతదేశంలో చాలామంది పెద్దహీరోలందరికీ రూల్ బుక్ లా మారింది. కథలో హీరో అమాయకుడిలా అందరితో […]
Advertisement
కొంతకాలంగా సినిమాలు చిత్రీకరణలో ఉండగానే కథలు లీక్ అవుతున్నాయి. వీటిలో చాలామటుకు ప్రచారం కోసం చిత్ర యూనిట్ సభ్యులే లీక్ చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. తాజాగా కొరటాల-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న జనతా గ్యారేజీ కథ లీక్ అయిందని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కూడా భాషా సినిమాను పోలి ఉంటుందన్న పుకారు ఇండస్ట్రీలో బయల్దేరింది. భాషా సినిమా దక్షిణ భారతదేశంలో చాలామంది పెద్దహీరోలందరికీ రూల్ బుక్ లా మారింది. కథలో హీరో అమాయకుడిలా అందరితో కలిసి తిరుగుతుంటాడు. కానీ, ఇంటర్వెల్ టైమ్‌కి హీరో పెద్ద లీడర్ అనో, లేదంటే మాఫియా డాన్ అనో అందరికీ తెలిసిపోతుంది. దీంతో అంతా షాకవుతారు. ఇదే ఫార్ములా ఇప్పటికీ అటు రుద్దీ.. ఇటు రుద్దీ జనాల మీదకు చాలాసార్లు వదిలారు మన తెలుగు దర్శకులు… సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, నరసింహా, సింహాద్రి, జయం మనదేరా! తదితర చిత్రాలన్నింటికి మూలం భాషా సినిమానే! అంతెందుకు మొన్నటికి మొన్నవచ్చిన నాయక్ సినిమా కూడా ఈ కోవలేనిదే. కాకుంటే మాఫియా ప్లేస్‌లో మన నేటివిటికి సరిపోయేలా ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని జోడించారు తెలుగు దర్శకులు.
మోహన్‌లాల్ గాడ్‌ఫాదర్!
ఈ సినిమాలోనూ రోటీన్‌గా జూనియర్ జనతా గ్యారేజీలో మెకానిక్‌లా కనిపిస్తాడని, ఇంటర్వెట్ టైమ్‌లో అతను మాఫియా మనిషి అని తెలుస్తుందని సమాచారం. ఇక అప్పటి నుంచి ఫ్టాష్ బ్యాక్ ఎపిసోడ్ రన్ అవుతుందని, మాఫియా గాడ్‌ఫాదర్ మోహన్‌లాల్‌కు జూనియర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్న లైన్ పై కథ నడుస్తుందని ప్రచారం సాగుతోంది. కథ రొటీన్ అయినప్పటికీ కొరటాల టేకింగ్ కొత్తగా ఉంటుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. సాధారణ కథ అయినా.. కొరటాల శివ తన మార్క్ టేకింగ్‌తో మెస్మరైజ్ చేస్తాడని నిర్మాత, చిత్ర యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Advertisement