నీ కోరిక తీర్చడం మా వల్ల కాదమ్మ
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కలు చూపించబోయారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్పోర్ట్స్ అవార్డు కార్యక్రమానికి సానియాను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించబోయిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం .. ఆమె పెట్టిన షరతులు, డిమాండ్లు చూసి షాకైంది. నమస్కారం పెట్టి పారిపోయింది. ఈవెంట్‌కు సానియాని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించగా రావడానికి ఆమె అంగీకరించారు. అనంతరం సానియాకు చేయాల్సిన మర్యాదలపై ఆమె పీఏను సంప్రదించారు. అక్కడే ఆ రాష్ట్ర అధికారులకు దిమ్మతిగింది. సానియా భోపాల్ రావడానికి, తిరిగి […]
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కలు చూపించబోయారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్పోర్ట్స్ అవార్డు కార్యక్రమానికి సానియాను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించబోయిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం .. ఆమె పెట్టిన షరతులు, డిమాండ్లు చూసి షాకైంది. నమస్కారం పెట్టి పారిపోయింది.
ఈవెంట్‌కు సానియాని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించగా రావడానికి ఆమె అంగీకరించారు. అనంతరం సానియాకు చేయాల్సిన మర్యాదలపై ఆమె పీఏను సంప్రదించారు. అక్కడే ఆ రాష్ట్ర అధికారులకు దిమ్మతిగింది. సానియా భోపాల్ రావడానికి, తిరిగి వెళ్లడానికి ఒక చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని సూచించించారు పీఏ. సానియా సహాయకుల కోసం ఐదు బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేయాలని చెప్పేశారు. .సానియా పీఏ మరో విచిత్రమైన డిమాండ్ కూడా వారి ముందుంచారు.
Click to Read: వరంగల్ ఫలితం క్రెడిట్ నాదే!
75వేల రూపాయల విలువైన మేకప్ కిట్ ఇవ్వాలని కోరారు.. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి యశోధర రాజే స్వయంగా బయటపెట్టారు. సానియా డిమాండ్లను తాము తీర్చలేమని అందుకే ఈవెంట్‌కు ఆమెను గెస్ట్‌గా ఆహ్వానించలేదని చెప్పారు. అయితే కార్యక్రమానికి హాజరయ్యేందుకు సానియా భారీగా ఫీజు కూడా అడిగారన్న వార్తలొస్తున్నాయి. కానీ ఆ విషయం గురించి మాత్రం మధ్యప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి మాట్లాడలేదు. సానియా స్థానంలో చీఫ్ గెస్ట్‌గా పుల్లెల గోపిచంద్ వెళ్లారు. డిసెంబర్ 1న భోపాల్‌లో స్పోర్ట్స్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది.
Click to Read: Shocking!: Greek girls selling sex for sandwiches