ఓయూలో పెద్ద‌కూర వ‌ర్సెస్ పందికూర‌

అస‌హ‌నం విశ్వ‌విద్యాల‌యాల‌నూ తాకింది. చ‌దువులో పోటీ ప‌డాల్సిన వారు ఇప్పుడు ఆహార‌పు అల‌వాట్ల‌పై పోరాటం చేసుకుంటున్నారు. ఒకరు పెద్ద కూర అంటే మ‌రొక‌రు పంది కూర అంటూ సిద్ధ‌మ‌వుతున్నారు. డిసెంబ‌ర్ 10న  దళిత‌, మైనార్జీ, వామపక్ష విద్యార్థి సంఘాలు బీఫ్‌ పెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల చేశారు. అయితే   మరికొన్ని విద్యార్థి సంఘాలు ఇప్పుడు పంది కూర ఫెస్టివల్‌ను తెరపైకి తెచ్చాయి. బీఫ్‌ పెస్టివల్ నిర్వహించే రోజు తాము పందికూర ఫెస్టివల్ నిర్వహిస్తామంటూ పోస్టర్లు విడుదల చేశారు. అయితే ఈ పందికూర ఫెస్టివల్‌ […]

Advertisement
Update:2015-12-02 10:14 IST

అస‌హ‌నం విశ్వ‌విద్యాల‌యాల‌నూ తాకింది. చ‌దువులో పోటీ ప‌డాల్సిన వారు ఇప్పుడు ఆహార‌పు అల‌వాట్ల‌పై పోరాటం చేసుకుంటున్నారు. ఒకరు పెద్ద కూర అంటే మ‌రొక‌రు పంది కూర అంటూ సిద్ధ‌మ‌వుతున్నారు. డిసెంబ‌ర్ 10న దళిత‌, మైనార్జీ, వామపక్ష విద్యార్థి సంఘాలు బీఫ్‌ పెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల చేశారు. అయితే మరికొన్ని విద్యార్థి సంఘాలు ఇప్పుడు పంది కూర ఫెస్టివల్‌ను తెరపైకి తెచ్చాయి. బీఫ్‌ పెస్టివల్ నిర్వహించే రోజు తాము పందికూర ఫెస్టివల్ నిర్వహిస్తామంటూ పోస్టర్లు విడుదల చేశారు. అయితే ఈ పందికూర ఫెస్టివల్‌ వెనుక బీఫ్‌ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తున్న వర్గాలు ఉన్నాయని కొందరు అనుమానిస్తున్నారు.

పందికి దూరంగా ఉండే ఓ వర్గం విద్యార్థులు కూడా బీఫ్‌ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో వారికి కౌంటర్‌గానే ఈ ఎత్తుగడ వేశారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీఫ్ ఫెస్టివల్‌ను నేరుగా అడ్డుకుంటే తప్పు తమ మీద ఉంటుందన్న ఎత్తుగడతో కొందరు పందికూర ఫెస్టివల్‌ను ప్రోత్సహిస్తున్నారా అని అనుమానిస్తున్నారు. అయితే పందికూర ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు సిద్ధమైన విద్యార్థి సంఘాలు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నాయి. తమ ఇష్టంతోనే పందికూర ఫెస్లివల్ నిర్వహించుకుంటున్నామని చెబుతున్నారు. అదే నిజమై ఎవరి ఫెస్టివల్‌ను వారు ప్రశాంతంగా నిర్వహించుకుంటే ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం ఉండదు. ఒకరి పండుగను మరొకరు అడ్డుకోవడం కన్నా ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు ఫుడ్‌ ఫెస్టివల్ జరుపుకుంటే మంచిదే.

విశేషం ఏమిటంటే ఆవు మాంసానికి వ్యతిరేకంగా ఇటీవల కొన్ని సామాజికవర్గాలు పోరాటానికి దిగాయి. ఓ వర్గం మొదటి నుంచి పంది అనే జంతువుకు దూరంగా ఉంటారు. ఇప్పుడు ఓయూలో పందికూర ఫెస్టివల్ నిర్వహించడం ఒక విధంగా వారిని రెచ్చగొట్టడానికే అన్న భావన వ్యక్తమవుతోంది. అయితే మొదటి నుంచి ఒక వర్గం … పందిని వ్యతిరేకిస్తున్నారు గానీ… పంది మాంసాన్ని అమ్మే షాపుల మీదగానీ, పంది మాంసం తింటున్న వారిపైగానీ దాడులు చేసిన దాఖలాలు లేవు. ఇప్పడు పంది కూర ఫెస్టివల్ నిర్వహించినా ఎలాంటి ప్రతిఘటన ఉండకపోవచ్చునని చాలా మంది భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News