హీరో సుధీర్ భాబుకు  గాయాలు

టాలీవుడ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకొని, ప్రస్తుతం బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న సుధీర్ బాబుకు ‘బాగీ’ సినిమా షూటింగ్ లో గాయాలయ్యాయి. టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ రిహార్సల్స్ సమయంలో అతడికి ఈ గాయాలు అయ్యాయి. తన చేతిమీద అయిన గాయాన్ని చూపిస్తూ సుధీర్ బాబు ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చేశాడు. క్లైమాక్స్ షూట్ సందర్భంగా చేసిన మరో ట్వీట్ లో టైగర్ ష్రాఫ్ ను […]

Advertisement
Update:2015-12-02 00:36 IST
టాలీవుడ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకొని, ప్రస్తుతం బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న సుధీర్ బాబుకు ‘బాగీ’ సినిమా షూటింగ్ లో గాయాలయ్యాయి. టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ రిహార్సల్స్ సమయంలో అతడికి ఈ గాయాలు అయ్యాయి. తన చేతిమీద అయిన గాయాన్ని చూపిస్తూ సుధీర్ బాబు ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చేశాడు.
క్లైమాక్స్ షూట్ సందర్భంగా చేసిన మరో ట్వీట్ లో టైగర్ ష్రాఫ్ ను పొగడ్తలతో ముంచేశాడు సుధీర్. హాలీవుడ్ లో కూడా ఇలాంటి యాక్షన్స్ సీన్స్ చూడలేదంటూ టైగర్ యాక్షన్ టాలెంట్ ను ఆకాశానికి ఎత్తేశాడు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన తెలుగు సినిమా ‘భలే మంచిరోజు’ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.
Tags:    
Advertisement

Similar News