దేవీపై అల్లు గుర్రు
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్నట్లుగా ఉంది దేవీ శ్రీ ప్రసాద్ సినీ తెరంగ్రేట్రం! ఈ కుర్ర సంగీత దర్శకుడు హీరో కావడం అల్లు అరవింద్ తో సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సినీజనాలు. ఎందుకు? అంటారా..! విషయం ఏంటంటే.. త్వరలోనే దేవీ శ్రీ ప్రసాద్ సుకుమార్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. సరిగ్గా ఇక్కడే అల్లు అరవింద్ కు నచ్చడం లేదు. దేవీ […]
Advertisement
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్నట్లుగా ఉంది దేవీ శ్రీ ప్రసాద్ సినీ తెరంగ్రేట్రం! ఈ కుర్ర సంగీత దర్శకుడు హీరో కావడం అల్లు అరవింద్ తో సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సినీజనాలు. ఎందుకు? అంటారా..! విషయం ఏంటంటే.. త్వరలోనే దేవీ శ్రీ ప్రసాద్ సుకుమార్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత. సరిగ్గా ఇక్కడే అల్లు అరవింద్ కు నచ్చడం లేదు. దేవీ శ్రీ ప్రసాద్ మంచి సంగీత దర్శకుడు. పైగా వేదికపై ఆడతాడు, పాడతాడు. ప్రేక్షకులకి ముఖ్యంగా యువత నాడి తెలిసిన కళాకారుడు. ఇన్ని మాటలెలందుకు? ఒక్క ముక్కలో చెప్పాలంటే.. హీరోకి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఈ విషయాన్ని అందరి కంటే ముందు అల్లు అరవింద్ ఏనాడో గుర్తించాడు. అందుకే, దేవిని హీరోగా పెట్టి సినిమా తీయాలని డిసైడైపోయాడు.
100 పర్సెంట్ లవ్ హీరోగా..!
అస్సలు ఐదేళ్ల క్రితం వచ్చిన 100 పర్సెంట్ లవ్ సినిమాలో హీరోగా ముందు దేవీ శ్రీ ప్రసాద్‌నే అనుకున్నారు. దీనికి తొలుత దేవీ సానుకూలంగానే స్పందించినా.. ఎందుకోగానీ వెనకడుగు వేశాడు. దేవీలోని హీరోని ఐదారేళ్ల క్రితమే గుర్తించిన తనని కాదని…ఇప్పుడు దిల్ రాజుకు సినిమా చేస్తుండటం అరవింద్‌కి నచ్చడం లేదంట. దేవి స్వతహాగా పాటగాడు.. ఆటగాడు.. అంతకుమించి సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న సంగీత దర్శకుడు. దేవీ హీరో అయితే.. సినిమా పబ్లిసిటీ, ఓపెనింగ్స్ విషయంలో ఢోకా ఉండదు. దేవికి తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి మార్కెట్ ఉంది. మనోడు తమిళంలోని అగ్ర సంగీత దర్శకుల్లో ఒకడన్న సంగతి తెలిసిందే! ఇన్ని క్వాలిటీలు ఉన్న దేవీని వదులు కోవడం ఏ నిర్మాతకు మాత్రం ఇష్టం ఉంటుంది చెప్పండి? అందుకే దేవీ శ్రీ ప్రసాద్‌పై అల్లు అరవింద్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
Advertisement