స‌ల్మాన్ సినిమా  క‌లెక్ష‌న్స్ ఢామాల్...!

ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ చిత్రం మరీ సోదిలా వుందని, పాత కాలం చిత్రాలని తలపించిందని మొదటి రోజే విమర్శలు వచ్చాయి. అయితే సల్మాన్‌ ఖాన్‌ సినిమాలకి టాక్‌తో పొంతన లేకుండా వసూళ్లు వచ్చినట్టు దీనికి కూడా కలెక్షన్లు మొదట్లో అదిరిపోయాయి. రెండవ వారాంతంలోగా రెండొందల కోట్లు వచ్చి పడిపోతాయని అనుకుంటే.. సెకండ్‌ వీకెండ్‌లో కలెక్షన్లు ధడేల్న పడిపోవడంతో ఇంకా ‘ప్రేమ్‌ రతన్‌’ ధనం రెండు వందల మార్కు దాటలేదు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు కేవలం […]

Advertisement
Update:2015-11-24 00:33 IST

ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ చిత్రం మరీ సోదిలా వుందని, పాత కాలం చిత్రాలని తలపించిందని మొదటి రోజే విమర్శలు వచ్చాయి. అయితే సల్మాన్‌ ఖాన్‌ సినిమాలకి టాక్‌తో పొంతన లేకుండా వసూళ్లు వచ్చినట్టు దీనికి కూడా కలెక్షన్లు మొదట్లో అదిరిపోయాయి. రెండవ వారాంతంలోగా రెండొందల కోట్లు వచ్చి పడిపోతాయని అనుకుంటే.. సెకండ్‌ వీకెండ్‌లో కలెక్షన్లు ధడేల్న పడిపోవడంతో ఇంకా ‘ప్రేమ్‌ రతన్‌’ ధనం రెండు వందల మార్కు దాటలేదు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు కేవలం ఇరవై కోట్ల నెట్‌ వసూళ్లు రావడంతో ఈ చిత్రం రెండు వందల మార్కు దాటడానికి మరో రెండు రోజులైనా అవసరమయ్యేట్టుంది.

ఈ చిత్రం కనీసం కిక్‌ వసూళ్లని దాటుతుందని అంచనా వేసారు కానీ కలెక్షన్ల ట్రెండ్‌ చూస్తుంటే అది జరిగేటట్టు కనిపించడం లేదు. రెండు వందల కోట్లు వచ్చేసాయంటే సినిమాని హిట్‌ కిందే పరిగణించవచ్చు కాకపోతే ఈ కాంబినేషన్‌ సృష్టిస్తుందని అనుకున్న సంచలనం మాత్రం నిజం కాలేదు. సల్మాన్‌కి ఇది రెండు వందల కోట్ల క్లబ్‌లో మూడో చిత్రం కానుంది. అమీర్‌కి తప్ప ఈ క్లబ్‌లో మూడు సినిమాలున్న హీరో ఇంకొరరు లేరు. మరోసారి స్టార్‌గా తన సత్తాని చాటుకున్న సల్మాన్‌ ఇప్పుడు తన సినిమాలకి రెండు వందల కోట్ల గ్రాస్‌ని బెంచ్‌మార్క్‌ చేసేసాడు.

Tags:    
Advertisement

Similar News