వ‌డివేల్ కు కోర్టు నోటిసులు

నడిగర్‌ సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు వడివేలు నామక్కల్‌ కోర్టులో హాజరు కావాలంటూ న్యాయమూర్తి నోటీసు జారీ చేశారు. ఇటీవల మదురైలో జరిగిన విలేఖరుల సమావేశంలో దక్షిణ భారత నటుల సంఘం కనిపించలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్ఫందించిన నామక్కల్‌ జిల్లా దక్షిణ భారత నడిగర్‌ సంఘ కార్యకర్తల సమిటీ సభ్యుడు, జిల్లా నాటక నటుల సంఘ అధ్యక్షుడైన ఆటో రాజా వడివేలుపై కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు […]

Advertisement
Update:2015-11-22 00:33 IST

నడిగర్‌ సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు వడివేలు నామక్కల్‌ కోర్టులో హాజరు కావాలంటూ న్యాయమూర్తి నోటీసు జారీ చేశారు. ఇటీవల మదురైలో జరిగిన విలేఖరుల సమావేశంలో దక్షిణ భారత నటుల సంఘం కనిపించలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్ఫందించిన నామక్కల్‌ జిల్లా దక్షిణ భారత నడిగర్‌ సంఘ కార్యకర్తల సమిటీ సభ్యుడు, జిల్లా నాటక నటుల సంఘ అధ్యక్షుడైన ఆటో రాజా వడివేలుపై కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ నటుల హృదయాలను ఆవేదనకు గురి చేశాయని, కావున ఆయనపై చర్యలు చేపట్టాలని పిటిషనలో కోరారు. శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి 27వ తేదీన జరిగే విచారణకు వడివేల్‌ కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసు జారీ చేశారు. నోటి దూల ఎక్కువ‌యితే ఇంతే మ‌రి..!

Tags:    
Advertisement

Similar News