అప్పుడర్ధమైంది నాకు… వ్యాయామం అవసరమని! " అమితాబ్ బచ్చన్
నిన్నటితరం హీరోలు ఇప్పుటి హీరోల్లా ఉలితో చెక్కిన శిల్పాల్లా ఉండేవారు కాదు, అలాగే హీరోయిన్లకూ శరీర కొలతల పట్టింపులు ఉండేవి కావు. వారంతా తమ సహజమైన ఆకారాల్లోనే కనిపించేవారు. అమితాబ్ బచ్చన్ కూడా అదేమాట అంటున్నారు. తాను చాలా బ్యాడ్ ఈటర్‌నని, ఫుడ్ విషయంలో ఎలాంటి నియమ నిబంధనలూ పాటించనని, క్రమశిక్షణతో ఉండనని చెబుతున్నారు. శిల్పా శెట్టి, పోషకాహార నిపుణుడు ల్యూక్ కౌంటినో తో కలిసి రాసిన పుస్తకం, ది గ్రేట్ ఇండియన్ డైట్ ని వెలువరించిన […]
నిన్నటితరం హీరోలు ఇప్పుటి హీరోల్లా ఉలితో చెక్కిన శిల్పాల్లా ఉండేవారు కాదు, అలాగే హీరోయిన్లకూ శరీర కొలతల పట్టింపులు ఉండేవి కావు. వారంతా తమ సహజమైన ఆకారాల్లోనే కనిపించేవారు. అమితాబ్ బచ్చన్ కూడా అదేమాట అంటున్నారు. తాను చాలా బ్యాడ్ ఈటర్‌నని, ఫుడ్ విషయంలో ఎలాంటి నియమ నిబంధనలూ పాటించనని, క్రమశిక్షణతో ఉండనని చెబుతున్నారు. శిల్పా శెట్టి, పోషకాహార నిపుణుడు ల్యూక్ కౌంటినో తో కలిసి రాసిన పుస్తకం, ది గ్రేట్ ఇండియన్ డైట్ ని వెలువరించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలే తనకు వ్యాయామం చేయమనే సందేశాన్ని ఇచ్చాయని కూడా అన్నారు. తాను నటించిన కొన్ని సినిమాల్లోని తన పర్సనాలిటీ చూసుకున్నాక జిమ్‌కి వెళ్లడం మొదలుపెట్టినట్టుగా అమితాబ్ చెప్పుకొచ్చారు.
పుస్తక సహ రచయిత్రి శిల్పా శెట్టి మూడేళ్ల తన కల ఈ పుస్తక ప్రచురణతో సాకారమైందన్నారు. మనుషుల దృష్టి ని వెయిట్ లాస్ మీద నుండి మంచి ఆరోగ్యం వైపు మళ్లించడమే ధ్యేయంగా తాము ఈ పుస్తకాన్ని రచించినట్టుగా ఆమె చెప్పారు. బరువు తగ్గాలని కాదు, ఆరోగ్యంగా ఉండాలనే తపనని పెంచుకోవాలని ఆమె సూచించారు.
ఈ పుస్తకానికి ముందుమాటని హిందీ నటుడు అనిల్ కపూర్ రాశారు. ఆరోగ్యవంతమైన జీవన శైలే తన ఫిట్‌నెస్ మంత్ర అని అనిల్ కపూర్ అన్నారు. అందరూ తనని మీ వయసు పెరగటం ఆగిపోయిందని అంటుంటారన్నారు. అయితే తనకూ వయసు పెరుగుతోందని, తానేమీ భ్రమల్లో లేనని చెబుతూ, పెరుగుతున్న వయసుని మన మనసు, జీవనశైలి..చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయని అన్నారు.