పవన్ వదిలేసిన టైగర్ గర్జిస్తుందా?
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కాదన్న ప్రాజెక్టు ఏ హీరోకు వెళ్లినా.. అది బంపర్‌హిట్ అన్నది తెలుగు ఇండస్ర్టీలో సంప్రదాయంగా వస్తోంది. తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న బెంగాల్ టైగర్ కూడా ఇదే కోవలో భారీ విజయాన్ని అందుకుంటుందా? అన్న చర్చ జరుగుతోంది. ఒకప్పుడు పూరీ జగన్నాధ్ బద్రీ సినిమా తరువాత పవన్ ని దృష్టిలో పెట్టుకుని చాలా కథలు రాసుకున్నారు. వాటిలో ఇడియట్, అమ్మా- నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు ఉన్నాయి. ఇందులో తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన పోకిరి […]
Advertisement
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కాదన్న ప్రాజెక్టు ఏ హీరోకు వెళ్లినా.. అది బంపర్‌హిట్ అన్నది తెలుగు ఇండస్ర్టీలో సంప్రదాయంగా వస్తోంది. తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న బెంగాల్ టైగర్ కూడా ఇదే కోవలో భారీ విజయాన్ని అందుకుంటుందా? అన్న చర్చ జరుగుతోంది. ఒకప్పుడు పూరీ జగన్నాధ్ బద్రీ సినిమా తరువాత పవన్ ని దృష్టిలో పెట్టుకుని చాలా కథలు రాసుకున్నారు. వాటిలో ఇడియట్, అమ్మా- నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు ఉన్నాయి. ఇందులో తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన పోకిరి కథ కూడా ఉందండయ్! ఆ సినిమాతో మహేశ్ ఒక్కసారిగా సూపర్‌స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇవన్నీ కూడా పవన్ వద్దని వదిలేసిన కథలే! కారణాలేంటో తెలియదు కానీ పవన్ వీటిని చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఆ అవకాశం రవితేజను వరించింది. లేటు వయసులో ఘాటుగా ఎంట్రీ ఇచ్చిన రవితేజకు ఈ సినిమాలు ఇండస్ట్రీలో మాస్ మహారాజు అన్న బిరుదును కట్టబెట్టేలా చేశాయి. ఇవే సినిమాలు పవన్ చేసి ఉంటే ఇంకా పెద్ద హిట్‌గా నిలిచేవని ఫిలింనగర్ టాక్!
త్రివిక్రమ్ బాటలోనే సంపత్‌నంది!
దర్శకుడు త్రివిక్రమ్ కూడా పవన్ కల్యాణ్ కోసం గతంలో ఓ కథ తయారు చేసుకుని వెళ్లాడు. దానిపైనా పవన్ అంతగా ఆసక్తి చూపించలేదు. అదే కథ మహేశ్ వద్దకు వెళ్లింది. కట్ చేస్తే.. అతడు సినిమా గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని ఫలితం బంపర్ హిట్! మహేశ్‌ను ఇండస్ట్రీలో తిరుగులేని యాక్షన్ హీరోగా నిలబెట్టింది. ఇక ఆ తరువాత పవన్ తన వద్దకు వచ్చిన ప్రాజెక్టులకు పెద్దగా నో చెప్పలేదు. గబ్బర్ సింగ్ విజయం తరువాత.. దర్శకుడు సంపత్ నంది సిద్ధం చేసిన బెంగాల్ టైగర్ కథను తొలుత ఓకే చేశాడు పవన్. దీన్ని గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్ గా తీద్దామనుకున్నారు. ఈ మధ్యలో పార్టీ పెట్టిన పవన్ సంపత్‌నందిని పక్కన బెట్టి బాబీని తీసుకున్నాడు. కథ కూడా మారింది. దీంతో సంపత్ వెంటనే రవితేజను సంప్రదించడం, ఆయన ఒకే చెప్పడం చకచకా జరిగిపోయి. పవన్ కాదన్న సినిమా బంపర్ హిట్ అన్న ముద్రపడిపోవడంతో రవితేజ ఎంతో సంతోషంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేశాడు. ఇప్పుడు ఫిలింనగర్‌లో ఈ చర్చ జోరుగా సాగుతోంది.
Advertisement