ఫ్లాప్ హీరోతో.. ఫ్లాప్ దర్శకుడు సినిమా

ఒకప్పుడు వాళ్లది హిట్ జోడీ. రెడీ లాంటి సూపర్ హిట్ సినిమా డెలివర్ చేశారు. ఆ సినిమా హిందీలో కూడా రీమేక్ అయి బంపర్ హిట్ అయింది. కానీ ప్రస్తుతం రామ్, శ్రీనువైట్ల పొజిషన్లు ఒకేలా ఉన్నాయి. శివమ్ సినిమాతో ఫ్లాప్ తెచ్చుకున్నాడు రామ్. అటు శ్రీనువైట్ల కూడా బ్రూస్ లీ, ఆగడు లాంటి రెండు పెద్ద ఫ్లాపులిచ్చాడు. ఇలా ఫ్లాపుల్లో ఉన్న ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు రెడీ మేజిక్ ను రిపీట్ చేద్దామనుకుంటున్నారు. తాజా […]

Advertisement
Update:2015-11-17 00:37 IST
ఫ్లాప్ హీరోతో.. ఫ్లాప్ దర్శకుడు సినిమా
  • whatsapp icon
ఒకప్పుడు వాళ్లది హిట్ జోడీ. రెడీ లాంటి సూపర్ హిట్ సినిమా డెలివర్ చేశారు. ఆ సినిమా హిందీలో కూడా రీమేక్ అయి బంపర్ హిట్ అయింది. కానీ ప్రస్తుతం రామ్, శ్రీనువైట్ల పొజిషన్లు ఒకేలా ఉన్నాయి. శివమ్ సినిమాతో ఫ్లాప్ తెచ్చుకున్నాడు రామ్. అటు శ్రీనువైట్ల కూడా బ్రూస్ లీ, ఆగడు లాంటి రెండు పెద్ద ఫ్లాపులిచ్చాడు. ఇలా ఫ్లాపుల్లో ఉన్న ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు రెడీ మేజిక్ ను రిపీట్ చేద్దామనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. త్వరలోనే శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేసేందుకు సిద్ధమౌతున్నాడు రామ్. ప్రస్తుతం ఈ హీరో నేను శైలజ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే శ్రీనువైట్ల దర్శకత్వంలో మూవీ ఉంటుంది.
బ్రూస్ లీ దెబ్బ నుంచి బయటపడేందుకు కొన్నిరోజులు చైనాలో ఉండి రెస్ట్ తీసుకొని వచ్చాడు శ్రీనువైట్ల. ఇప్పుడిప్పుడే ఆ డిజాస్టర్ నుంచి కోలుకుంటున్నాడు. మరోవైపు అఖిల్ తో చేయాల్సిన సినిమా కూడా చేజారిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీనువైట్ల-రామ్ మధ్య మీటింగ్ జరిగింది. రెడీ తర్వాత మళ్లీ కలుసుకోని ఈ జంట, ఇప్పుడు ఓ హిట్ ఇచ్చేందుకు కసితో పనిచేయాలని నిర్ణయించుకుంది. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోరే ఈ సినిమాను నిర్మిస్తాడట.
Tags:    
Advertisement

Similar News