దీపిక  కొత్త వివాదం

జిల్లెట్ రేజర్ ప్రకటనలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే నటించకుండా ఆపాలంటూ వచ్చిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ ప్రకటన వల్ల తమ హెయిర్ రిమూవల్ క్రీమ్ అమ్మకాలు దారుణంగా పడిపోతాయంటూ రెకిట్ బెన్‌కిసర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. తొలుత సింగిల్ జడ్జితో కూడిన బెంచ్‌లో తమకు ఎలాంటి తాత్కాలిక ఊరట రాకపోవడంతో దాన్ని మళ్లీ సవాలు చేయగా, జస్టిస్ బదర్ దుర్రెరజ్ అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవలతో […]

Advertisement
Update:2015-11-09 00:37 IST

జిల్లెట్ రేజర్ ప్రకటనలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే నటించకుండా ఆపాలంటూ వచ్చిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ ప్రకటన వల్ల తమ హెయిర్ రిమూవల్ క్రీమ్ అమ్మకాలు దారుణంగా పడిపోతాయంటూ రెకిట్ బెన్‌కిసర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. తొలుత సింగిల్ జడ్జితో కూడిన బెంచ్‌లో తమకు ఎలాంటి తాత్కాలిక ఊరట రాకపోవడంతో దాన్ని మళ్లీ సవాలు చేయగా, జస్టిస్ బదర్ దుర్రెరజ్ అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవలతో కూడిన ధర్మాసనం ప్రోక్టర్ అండ్ గాంబుల్ హైజీన్ అండ్ హెల్త్‌కేర్ లిమిటెడ్, జిల్లెట్ ఇండియా లిమిటెడ్ కంపెనీలకు నోటీసు జారీచేసి, సమాధానాలు ఇవ్వాలని కోరింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.
జిల్లెట్ వాళ్ల వీనస్ రేజర్ ప్రకటన తమ ఉత్పత్తి అయిన వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ పేరు చెడగొట్టేలా ఉందని రెకిట్ వాదించింది. ఆ ప్రకటన వీడియోలో స్పాట్యులా అనే పరికరాన్ని చూపిస్తున్నారని, దాన్ని తమ క్రీమ్ వాడేందుకు ఉపయోగిస్తారని, అందువల్ల ఆ వీడియోను ఆపడం లేదా కనీసం స్పాట్యులాను బ్లర్ లేదా మాస్క్ చేయడం తప్పనిసరని రెకిట్ వాదిస్తోంది. ప్రకటనలో దీపికా పడుకొనే నటించడం వల్ల దానికి మరింత ప్రచారం వస్తుందని తెలిపింది. అయితే, రెండోపక్షం వాదనలు కూడా విన్న తర్వాత గానీ నిర్ణయం చెప్పలేమని, అప్పటివరకు తాత్కాలిక ఊరట కూడా ఇచ్చేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News