కమల్‌కి చెల్లిగా పుడతా: షకీలా
మరో జన్మంటూ ఉంటే కమల్ హసన్‌కి చెల్లిగా పుడతా.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. ఇండియన్ సెక్స్ బాంబ్ షకీలా! చాన్స్ దొరికితే కమల్ పక్కన హీరోయిన్‌గా చేయాలని కోరుకుంటారు గానీ, చెల్లిగా పుట్టాలని కోరుకోవడమేంటి? విడ్డూరం కాకపోతేనూ..? అని ముక్కున వేలేసుకోకండి! ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ఈ శృంగార తార తన మనసులో మాట బయటపెట్టింది. చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు కమల్ సార్‌ని చూస్తే.. అన్నయ్యలా అనిపిస్తాడని చెప్పింది. కమల్ సార్ అంత […]
Advertisement
మరో జన్మంటూ ఉంటే కమల్ హసన్‌కి చెల్లిగా పుడతా.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. ఇండియన్ సెక్స్ బాంబ్ షకీలా! చాన్స్ దొరికితే కమల్ పక్కన హీరోయిన్‌గా చేయాలని కోరుకుంటారు గానీ, చెల్లిగా పుట్టాలని కోరుకోవడమేంటి? విడ్డూరం కాకపోతేనూ..? అని ముక్కున వేలేసుకోకండి! ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ఈ శృంగార తార తన మనసులో మాట బయటపెట్టింది. చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు కమల్ సార్‌ని చూస్తే.. అన్నయ్యలా అనిపిస్తాడని చెప్పింది. కమల్ సార్ అంత దూరంలో ఉన్నాడని తెలిసినా.. నాకు భయమని వెల్లడించింది. తాను అన్నయ్యగా భావించే కమల్ సినిమాలో ముద్దు సన్నివేశంలో కనిపించినా.. తాను తల దించుకుంటానని, కమల్ అంటే అంత తనకు అంత గౌరవమని చెప్పుకొచ్చింది. కమల్‌ని జీవితంలో ఒక్కసారైనా కలుసుకోవాలని తన మనసులో కోరికను బయటపెట్టింది. ఆయన కనిపిస్తే.. కాళ్లపై పడి మనసులో బాధ తీరేలా ఏడవాలని ఉందని చెప్పింది. షకీలా మనసులో ఉన్న ఈ కోరికను విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు.
స్టార్‌డమ్ లేకపోతే.. అంతే!
సినిమా రంగంలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయనడానికి షకీలా జీవితమే చక్కటి ఉదాహరణ. ఒకప్పుడు రెండు రోజులకు ఒక సినిమా చొప్పున చేసేది షకీలా. ఏడాదిలో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయో తనకే లెక్క తెలిసేది కాదట. ఒక దశలో మలయాళంలో షకీలా సినిమాలు విడుదలవుతున్నాయంటే.. మోహన్‌లాల్ లాంటి పెద్దతారలు తమ సినిమాలు వాయిదాలు వేసుకున్నారు. ఆమె సినిమాలు ఆపాలని కోర్టులకు ఎక్కారు. ఈ ఉదాహరణలు చాలు షకీలా సినిమాలకు ఎంతటి పవర్ ఉండేదో తెలిపేందుకు? అలాంటి పాత్రలు వేసినందుకు తానెప్పుడూ చింతించలేదని, ఈ వృత్తే తన కుటుంబ సమస్యలు తీర్చిందని, స్టార్ డమ్ ఉన్నపుడు అందరూ వెంట ఉన్నారని, ఇప్పుడు కుటుంబ సభ్యులు దూరమై.. ఒంటరిని అయిపోయానని షకీలా వాపోయింది. 15 ఏళ్ల క్రితమే తాను బీ-గ్రేడ్ సినిమాలు మానేశానని చెప్పింది. దర్శకుడు తేజ పుణ్యమాని జయం సినిమాతో తాను క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొత్త జీవితాన్ని ప్రారంభించానని గుర్తు చేసుకుంది. కన్నడ, తమిళంలో ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నాని, కానీ తెలుగులో ఎవరూ ఎందుకు పిలవడం లేదో అర్థం కావడం ఆవేదన చెందింది.
Advertisement