అమితాబ్ కు ఏమీ తేలియ‌ద‌ట‌

దర్శకుడు శంకర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాలని చూస్తున్న రోబో-2 (రోబోకు సీక్వెల్) సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తారంటూ ఇంతకుముందు వినిపించింది. అయితే, అసలు ఆ సినిమాలో నటించాలంటూ ఆయనను ఇంతవరకు ఎవరూ అడగలేదట. రజనీకాంత్, అమితాబ్ మంచి మిత్రులు కావడం, వాళ్ల తొలి రోజుల్లో ఇద్దరూ కలిసి కొన్ని హిందీ సినిమాల్లో కూడా చేసి ఉండటంతో రోబో సీక్వెల్‌లో బిగ్ బీ కూడా ఉంటారని ఇంతకుముందు అన్నారు. అసలు తననెవరూ దాని గురించి అడగలేదని, […]

Advertisement
Update:2015-11-08 00:34 IST

దర్శకుడు శంకర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించాలని చూస్తున్న రోబో-2 (రోబోకు సీక్వెల్) సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తారంటూ ఇంతకుముందు వినిపించింది. అయితే, అసలు ఆ సినిమాలో నటించాలంటూ ఆయనను ఇంతవరకు ఎవరూ అడగలేదట. రజనీకాంత్, అమితాబ్ మంచి మిత్రులు కావడం, వాళ్ల తొలి రోజుల్లో ఇద్దరూ కలిసి కొన్ని హిందీ సినిమాల్లో కూడా చేసి ఉండటంతో రోబో సీక్వెల్‌లో బిగ్ బీ కూడా ఉంటారని ఇంతకుముందు అన్నారు. అసలు తననెవరూ దాని గురించి అడగలేదని, ఈ విషయం తనకు తెలియనే తెలియదని.. ఇదంతా తప్పుడు వార్తేనని అమితాబ్ స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.

2010లో విడుదలైన రోబో సినిమాలో రజనీకాంత్, ఐశ్వర్యా రాయ్ జంటగా నటించిన విషయం, ఆ సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. రోబోగా కూడా రజనీయే నటించిన ఈ సినిమా భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. తాజాగా బిగ్ బీ మాత్రం.. ఫర్హాన్ అఖ్తర్‌తో పాటు వజీర్ సినిమాలో నటిస్తున్నారు. ఒక్క‌మాట నిజం .. రోబో 2 ను ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్ట్ చేయాల‌ని క‌ల‌లు కంటున్నారు డైరెక్ట‌ర్ శంక‌ర్. అందులో భాగంగానే హాలీవుడ్ లేజండ్రి యాక్ట‌ర్ ఆర్నాల్డ్ ను ఈ ప్రాజెక్ట్ లో విల‌న్ రోల్ కు సంప్ర‌దిస్తున్నారు. మ‌రి శంక‌ర్ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు వ‌ర్కువుట్ అవుతుందో.. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Tags:    
Advertisement

Similar News