రాజమౌళి 1000 కోట్ల ప్రాజెక్ట్ ఇదే

‘బాహుబలి’ సినిమాతో ఔరా అనిపించిన దర్శకుడు రాజమౌళి…. తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజికి తీసుకెళ్లాడు మన రాజమౌళీ.  ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2ను తెరకెక్కించే పనిలో ఉన్న రాజమౌళి దీని తర్వాత ‘గరుడ’ అనే మరో భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్లు టాక్. అసలు ‘గరుడ’ ప్రాజెక్టు గురించి రాజమౌళి ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. అయితే ఫిల్మ్ నగర్లో మాత్రం ఈ విషయమై హాట్ టాపిక్ నడుస్తోంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ […]

Advertisement
Update:2015-11-06 07:34 IST
‘బాహుబలి’ సినిమాతో ఔరా అనిపించిన దర్శకుడు రాజమౌళి…. తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజికి తీసుకెళ్లాడు మన రాజమౌళీ. ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2ను తెరకెక్కించే పనిలో ఉన్న రాజమౌళి దీని తర్వాత ‘గరుడ’ అనే మరో భారీ ప్రాజెక్టు చేయబోతున్నట్లు టాక్. అసలు ‘గరుడ’ ప్రాజెక్టు గురించి రాజమౌళి ఇప్పటి వరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. అయితే ఫిల్మ్ నగర్లో మాత్రం ఈ విషయమై హాట్ టాపిక్ నడుస్తోంది.
దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఇండియన్ సినీ చరిత్రలో ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే అని అంటున్నారు. అయితే ఇండియాలో ఇంత పెద్ద‌ బడ్జెట్ పెట్టే సంస్థలు గానీ, నిర్మాతలు గానీ లేరు. అందుకే ముందుగా రూ. 25 కోట్ల ఖర్చుతో 25 సెకన్ల నిడివిగల ‘గరుడ’ టీజర్ రూపొందించి…. తద్వారా ఇంటర్నేషనల్ సినీ నిర్మాణ సంస్థలను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారట. గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించే ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కబోతోందట. బాహుబ‌లి చిత్రంతో రాజ‌మౌళి ఖ్యాతి అంత‌ర్జాతీయం కావ‌డంతో.. త‌న క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నంలో రాజ‌మౌళి వున్నారు. అయితే నిజంగా ఈ ప్రాజెక్ట్ తెర‌కెక్కితే.. క‌చ్చితంగా రాజ‌మౌళి హాలీవుడ్ ద‌ర్శ‌కుల్ని ఓవ‌ర్ టేక్ చేసిన‌ట్లే.!. ప్రాజెక్ట్ క‌మ‌ర్షియ‌ల్ గా కూడా ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్ట్ అవుతుంది అన‌డంలో సందేహాం లేదు. హాలీవుడ్ ఆర్టిస్ట్ ల్ని.. బాలీవుడ్ ఆర్టిస్ట్ ల్ని క‌లిపి సినిమాను చేస్తాడ‌న‌డంలో కూడా సందేహాం లేదు.
Tags:    
Advertisement

Similar News