త్రిపుర రివ్యూ

రేటింగ్: 2.5/5 బ్యానర్ : జీ మీడియా నటీనటులు: కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర, శ్రీమాన్, పూజ, సప్తగిరి, రావు రమేశ్, షకలక శంకర్, ధన్ రాజ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు  స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ మాటలు: రాజా సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా ఎడిటింగ్: ఉపేంద్ర పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎమ్.రాజశేఖర్,  కథ-దర్సకత్వం: రాజకిరణ్ సమర్పణ: జె.రామాంజనేయులు. ​​​ నిర్మాతలు : ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్  విడుదల తేదీ […]

Advertisement
Update:2015-11-06 11:16 IST

రేటింగ్: 2.5/5

బ్యానర్ : జీ మీడియా
నటీనటులు: కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర, శ్రీమాన్, పూజ, సప్తగిరి, రావు రమేశ్, షకలక శంకర్, ధన్ రాజ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు
స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ
మాటలు: రాజా
సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా
ఎడిటింగ్: ఉపేంద్ర
పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎమ్.రాజశేఖర్,
కథ-దర్సకత్వం: రాజకిరణ్
సమర్పణ: జె.రామాంజనేయులు.
​​​ నిర్మాతలు : ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్
విడుదల తేదీ : నవంబర్ 6, 2015.

వారానికో దెయ్యం చొప్పున వంతులు వేసుకుని మరీ తెలుగు తెర మీదకు వచ్చి నవ్వించి, భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. దాంతో దెయ్యం అంటే ఇలాగే ఉంటుంది, దెయ్యం కథ అంటే ఈ విధంగానే సాగుతుంది, ఇక్కడ భయపెడతారు, ఇక్కడ నవ్విస్తారు అని స్క్రీన్ ప్లే ఊహించే స్దాయికి సగటు ప్రేక్షకులుకు చేరుకున్నాడు. దాంతో ఈ తరహా సినిమాలు తీసే దర్శక,నిర్మాతలకు కాస్త ఇబ్బంది కర పరిస్ధితే ఏర్పడింది. అలాగే ఈ తరహా కథలకు అలవాటు పడిన వారికి కొత్తదనం లేకపోతే కక్కు వచ్చే పరిస్దితి ఏర్పడింది. ముఖ్యంగా రొటీన్ దెయ్యం చేష్టలను అసలు భరించలేకపోతున్నారు. అది గమనించిన వాళ్లు పాత దెయ్యాలతోనే కొత్త కథలు అల్లి అలరిస్తున్నారు. కాని వాళ్లు ప్రేక్షకులకు సహన పరీక్షపెడుతున్నారు. ఈ మధ్యనే గీతాంజలి అంటూ దెయ్యం కథతో నవ్వించి భాక్సాఫీస్ ని గెలిచిన రాజ్ కిరణ్ అదే ఉత్సాహంతో మరో దెయ్యం కథ పట్టుకుని థియోటర్లోకి దూకేసారు. హీరోయిన్ మార్చి ఏమార్చే ప్రయత్నం చేసారు. కానీ కథలో ట్విస్ట్ లు సరైన టైమ్ కు పడకపోవటంతో , అక్కడక్కడా నవ్వించినా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. అక్కడికీ కలర్స్ స్వాతి ఉన్నంతలో ప్రయత్న లోపం లేకుండా కష్టపడింది కానీ అవి పెద్దగా పనికిరాలేదనే చెప్పాలి.

త్రిపుర క‌థ‌..
ఎప్పటికప్పుడు తింగరితనం, కాస్త గడుసుతనం కలిగిన పల్లెటూరి అమ్మాయి త్రిపుర(కలర్స్ స్వాతి) కి చిన్నప్పటినుంచి కొన్ని కలలు వస్తుంటాయి. అయితే ట్విస్ట్ ఏమిటంటే… ఆ కలలు ..కలలుగా మిగిలిపోకుండా… రియల్ లైఫ్‌లో నిజం అవుతుంటాయి. దాంతో ఆమెను డాక్టర్ చంద్ర(నవీన్ చంద్ర)దగ్గరకు తీసుకు వెళ్తారు. కలలు మాటేమో కానీ వీళ్లిద్దరూ ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటారు. దాంతో వారు సిటీలో కాపురం పెడతారు. అయితే ఇక్కడా ఆమె కలలు కంటిన్యూ అవుతాయి. ఆమె వైవాహిక జీవితం సజావుగా సాగదు. తన వైవాహిక జీవితానికి చనిపోయిన ఈశ(పూజ)కు సంభంధం ఉందని తెలుసుకుంది. అక్కడో ట్విస్ట్ రివీల్ అవుతుంది. చంద్రకు, ఈషకు మధ్య గతంలో లవ్ స్టోరీ ఉందనే విషయం రివీల్ అవుతుంది. మరో ప్రక్క తిలక్ (తిలక్) డాక్టర్ ఈష(పూజ రామచంద్రన్) కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూంటాడు. అసలు ఈ కలలు నిజం అవటం ఏమిటి…ఈశ మరణం వెనక ఉన్న రహస్యం ఏమిటి…దానికి చంద్రకు సంభందం ఏమిటి…అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప‌నితీరు
డైరక్టర్ రాజ్ కిరణ్.. తన తొలి చిత్రం గీతాంజలి కు భిన్నంగా చేయటానికే ప్రయత్నించాడనే చెప్పాలి. కామెడీతో పాటు డ్రామా, రొమాన్స్ ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేయాలని చూసాడు. అయితే సినిమా సీన్స్ లో కావాల్సిన సస్పెన్స్ మాత్రం మెయింటైన్ చేయలేకపోయాడు. అవుట్ డేటెడ్ నేరేషన్, స్క్రీన్ ప్లే సినిమాని ఇబ్బందికరంగా మార్చేసాయి. సినిమాలో ఏదైతే కీలకమైన ట్విస్ట్ ఉండి కథ మలుపు తిరుగుతుందో అది ఇంటర్వెల్ కూడా రాలేదు. దాంతో కథ చాలా సేపు ఏ ఎలిమెంటూ లేక ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేదాకా డ్రాగ్ అవుతూంటుంది.

తీర్పు
రిలీజ్ కు ముందు సినిమాకు కొంత హైపు వ‌చ్చింది. అయితే ద‌ర్శ‌కుడు క‌థ‌నం విష‌యం లో కొంత శ్ర‌ద్ద వహించాల్సింది. సాధార‌ణంగా దెయ్యాల చిత్రాలంటే ఆడియ‌న్స్ ఊహాల‌కు అంద‌కుండ క‌థ‌నం న‌డ‌పాలి. రెగ్యుల‌ర్ క‌థాల సినిమా చూస్తున్న వారికి .. త‌రువాత సీన్ ఏం జ‌రిగిపోతుంది ముందే తెలిసిపోతే బొమ్మ తేలిపోయిన‌ట్లే. త్రిపుర విష‌యంలో అదే జ‌రిగింది. న‌టీ న‌టుల నుంచి మంచి యాక్టింగ్ రాబ‌ట్లుకున్నా డు గానీ.. సినిమా క‌థ , క‌థ‌నాలు ఆడియ‌న్స్ ఊహాల‌కు అంద‌డంతో.. తేలిపోయిన‌ట్లు అనిపిస్తుంది. మొత్తం మీద ఒక‌సారి చూడొచ్చు అనిపిస్తుంది. కొంత న‌వ్వులు..కొన్ని భ‌యాలు. నాట్ బ్యాడ్ అనిపిస్తాయి .

Tags:    
Advertisement

Similar News