తైవాన్ చిత్రోత్సవానికి బాహుబలి
ఇండియాలో సంచలనం సృష్టించిన బాహుబలి సినిమా ఇప్పుడు తైవాన్ లో కూడా సందడి చేయడానికి సిద్ధమౌతోంది. ఈ సినిమాను తైవాన్ ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. ఈనెల 7 నుంచి 26వరకు తైపీలో జరిగే గోల్డెన్ హార్స్ ఫిలింఫెస్టివల్ లో బాహుబలి సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. తైవాన్ లో జరిగే అతిపెద్ద చిత్రోత్సవం ఇదే. అంతర్జాతీయ స్థాయిలో పేరుసంపాదించుకున్న చిత్ర రాజాల్ని ఈ వేదికపై ప్రదర్శిస్తారు. ఉత్తమమైన చిత్రాలకు అవార్డులు కూడా అందిస్తారు. ఇలాంటి అత్యున్నత స్థాయి […]
Advertisement
ఇండియాలో సంచలనం సృష్టించిన బాహుబలి సినిమా ఇప్పుడు తైవాన్ లో కూడా సందడి చేయడానికి సిద్ధమౌతోంది. ఈ సినిమాను తైవాన్ ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. ఈనెల 7 నుంచి 26వరకు తైపీలో జరిగే గోల్డెన్ హార్స్ ఫిలింఫెస్టివల్ లో బాహుబలి సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. తైవాన్ లో జరిగే అతిపెద్ద చిత్రోత్సవం ఇదే. అంతర్జాతీయ స్థాయిలో పేరుసంపాదించుకున్న చిత్ర రాజాల్ని ఈ వేదికపై ప్రదర్శిస్తారు. ఉత్తమమైన చిత్రాలకు అవార్డులు కూడా అందిస్తారు. ఇలాంటి అత్యున్నత స్థాయి వేదికపై మన బాహుబలి మెరవనుంది. ఇదే ఊపులో ఈ సినిమాకు అవార్డు కూడా వస్తే, రాజమౌళి మరో అరుదైన రికార్డు సృష్టించినట్టే. ప్రస్తుతం బాహుబలి పార్ట్-2 కోసం సిద్ధమౌతున్నాడు రాజమౌళి. వచ్చేనెల నుంచి పార్ట్-2 షూటింగ్ స్టార్టవుతుంది. ఈ గ్యాప్ లో జక్కన్న, తైవాన్ వెళ్తాడా.. లేక పూర్తిగా పార్ట్-2 పనిలో నిమగ్నమైపోతాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
Advertisement