రాధికా ఆప్టేకు అదేం ఫోబియా?
విషయాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందిన నటి రాధికాఆప్టే! తెలుగులో రక్తచరిత్ర, ధోనీ, లెజెండ్ వంటి సినిమాల్లో మెరిసింది. తరువాత బాలీవుడ్లో శృంగారాన్ని ఒలికించింది. హంటర్ సినిమాలో అందాల ఆరబోతతో యువతకు నిద్రలేకుండా చేసింది. దీనికితోడు ఆమె నగ్న చిత్రాలు నెట్లో పోస్టు అవడం పెను సంచలనం సృష్టించింది. కొంతకాలంగా కుర్రకారును కలవరపెడుతున్న ఈ శృంగార తార తరచుగా ఆసుపత్రికి వెళుతోందట. అయ్యో! ఏమైంది..? కుటుంబ సభ్యులెవరికైనా ఆరోగ్యం బాగోలేదా? లేదా తెలిసిన వారెవరైనా ఆసుపత్రిలో […]
Advertisement
విషయాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందిన నటి రాధికాఆప్టే! తెలుగులో రక్తచరిత్ర, ధోనీ, లెజెండ్ వంటి సినిమాల్లో మెరిసింది. తరువాత బాలీవుడ్లో శృంగారాన్ని ఒలికించింది. హంటర్ సినిమాలో అందాల ఆరబోతతో యువతకు నిద్రలేకుండా చేసింది. దీనికితోడు ఆమె నగ్న చిత్రాలు నెట్లో పోస్టు అవడం పెను సంచలనం సృష్టించింది. కొంతకాలంగా కుర్రకారును కలవరపెడుతున్న ఈ శృంగార తార తరచుగా ఆసుపత్రికి వెళుతోందట. అయ్యో! ఏమైంది..? కుటుంబ సభ్యులెవరికైనా ఆరోగ్యం బాగోలేదా? లేదా తెలిసిన వారెవరైనా ఆసుపత్రిలో ఉన్నారా? కొంపదీసి రాధికాకు ఏమైనా.. అయ్యిందా..? అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే అలాంటిదేమీ లేవని తెలియడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరి అలాంటపుడు ఎందుకు ఆసుపత్రికి వెళుతోంది? అనే కదా మీ ప్రశ్న..!
అసలు విషయం అదీ..!
రాధికా హంటర్ సినిమాలో శృంగారాన్ని ఎంతలా ఒలికించిందో.. మాంఝీ సినిమాలో కొండప్రాంత యువతిగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. బాలీవుడ్లో అవకాశాలు వెల్లువెత్తడమో లేక దక్షిణాదిన నిజంగానే ఇబ్బందులు పడిందేగానీ.. తాను ఇక సౌత్ సినిమాలు చేయనని తెగేసి చెప్పింది. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎన్నుకుంటూ.. అవసరమైతే అందాల ఆరబోతకు సై అంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగానే త్వరలో ఫోబియా అనే చిత్రంలో నటించనుందట. ఈ చిత్రంలో ప్రతి చిన్న విషయానికి భయపడే పాత్రలో రాధిక ఆప్టే నటించనుంది. ఫోబియా రోగులు ఎలా ఉంటారు? తోటివారితో ఎలా ప్రవర్తిస్తారు? వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? తదితర విషయాలను రాధికా సీరియస్గా స్టడీ చేస్తుందట. అందుకోసమే ఆసుపత్రికి వెళ్లి వివిధ ఫోబియాలతో బాధపడుతున్న మానసిక రోగులను దగ్గర నుంచి పరీశీలిస్తూ.. వారి కేస్ వివరాలు అధ్యయనం చేస్తుందట. నిజంగా గ్రేట్ కదా!
Advertisement