బాహుబలి-2 లో మాధురీ దీక్షిత్
బాహుబలి-2కి బాలీవుడ్ బ్యూటీ మాధూరి దీక్షిత్ అదనపు ఆకర్షణ కానున్నారా? అలాంటి అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు. బాహుబలి చిత్రం సాధించింది సాధారణ విజయం కాదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టి హాలీవుడ్ సినిమానే ఆశ్చర్యపరచేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి రాజమౌళి సృష్టించిన ఒక చరిత్ర. అయితే ఆ ఒక్క చరిత్రతో సంతృప్తి పడే మనస్తత్వం కాదు ఆయనది. తన రికార్డులను తానే తిరగరాసే అలుపెరుగని దర్శకుడు రాజమౌళి.అందుకే బాహుబలిని అధిగమించే […]
Advertisement
బాహుబలి-2కి బాలీవుడ్ బ్యూటీ మాధూరి దీక్షిత్ అదనపు ఆకర్షణ కానున్నారా? అలాంటి అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు. బాహుబలి చిత్రం సాధించింది సాధారణ విజయం కాదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టి హాలీవుడ్ సినిమానే ఆశ్చర్యపరచేలా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబలి రాజమౌళి సృష్టించిన ఒక చరిత్ర. అయితే ఆ ఒక్క చరిత్రతో సంతృప్తి పడే మనస్తత్వం కాదు ఆయనది. తన రికార్డులను తానే తిరగరాసే అలుపెరుగని దర్శకుడు రాజమౌళి.అందుకే బాహుబలిని అధిగమించే విధంగా బాహుబలి-2ను తీర్చిదిద్దడానికి నడుంబిగించారీ జక్కన్న. చిత్రాల్లో దృశ్యాలను అబ్బురపరచే విధంగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి. కాగా బాహుబలి-2ను మరిన్ని హంగులతో మరింత హద్భుతంగా సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. కాగా బాహుబలి-2లో ఒక నాటి బాలీవుడ్ బ్యూటీ మాధురిదీక్షిత్‌ను అదనపు ఆకర్షణగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమిచారం.
బాహుబలి చిత్రాన్ని ఉత్తర భారతంలో విడుదల చేసిన ప్రముఖ హిందీ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ఈ సూచనను రాజమౌళికి ఇచ్చారని తెలిసింది. ఇంతకు ముందు కరణ్‌జోహార్ రూపొందించిన పలు హిందీ చిత్రాల్లో మాధురి దీక్షిత్ నటించారు. కాగా బాహుబలి-2లో దక్షిణాదికి చెందిన నటులు చాలామంది ఉన్నారు.మాధురిదీక్షిత్ లాంటి బాలీవుడ్ నటి కూడా ఉంటే ఉత్తరాదిలో చిత్రానికి మరింత ప్రేక్షకాదరణ పెరుగుతుందన్న ఆలోచనను కరణ్‌జోహార్ రాజమౌళి ముందుంచినట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో మాధురిదీక్షిత్, అనుష్క సోదరిగా కుంతల దేశ రాణిగా నటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బాహుబలి చిత్రాన్ని చూసిన సూపర్‌స్టార్ రజనీకాంత్, సూర్య, అజిత్, బాలీవుడ్ బిగ్‌తో సహా దాని సీక్వెల్‌లో నటించాలన్న ఆసక్తిని కనబరచిన వారేనన్నది గమనార్హం.
Advertisement