లండన్ లో భారతీయుల సత్తా
నైపుణ్యం ఉంటే ఎక్కడైనా రాణించవచ్చని నిరూపిస్తున్నారు మన భారతీయులు. ఇప్పటికే అమెరికా, సింగపూర్, మలేషియా, దుబాయ్ లాంటి దేశాల్లో మెజారిటీ ప్రజలు భారతీయులే ఉన్నారు. ఒకప్పుడు మనల్ని పరిపాలించిన బ్రిటన్ లోనూ భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందట. సాక్షాత్తూ యూకే విడుదల చేసిన గణాంకాల్లోనే ఈవిషయం స్పష్టమైంది. బ్రిటన్ కు వెళ్లేందుకు ఏటా వీసాలు దక్కించుకుంటున్న వారిలో భారతీయులే ఎక్కువ ఉంటున్నారట. 2014 లెక్కల ప్రకారం సుమారు 7లక్షల 80వేల మందికిపైగా ఇండియన్స్ బ్రిటన్ లో ఉద్యోగాలు […]
నైపుణ్యం ఉంటే ఎక్కడైనా రాణించవచ్చని నిరూపిస్తున్నారు మన భారతీయులు. ఇప్పటికే అమెరికా, సింగపూర్, మలేషియా, దుబాయ్ లాంటి దేశాల్లో మెజారిటీ ప్రజలు భారతీయులే ఉన్నారు. ఒకప్పుడు మనల్ని పరిపాలించిన బ్రిటన్ లోనూ భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోందట. సాక్షాత్తూ యూకే విడుదల చేసిన గణాంకాల్లోనే ఈవిషయం స్పష్టమైంది.
బ్రిటన్ కు వెళ్లేందుకు ఏటా వీసాలు దక్కించుకుంటున్న వారిలో భారతీయులే ఎక్కువ ఉంటున్నారట. 2014 లెక్కల ప్రకారం సుమారు 7లక్షల 80వేల మందికిపైగా ఇండియన్స్ బ్రిటన్ లో ఉద్యోగాలు చేస్తున్నారట. యూకే వెళ్లాలనుకుంటున్న ప్రతి 10మందిలో 9 మందికి బ్రిటన్ వీసా మంజూరవుతోంది. 2013లో 89శాతం మందికి వీసా రాగా.. గత ఏడాది ఇది 91 శాతానికి చేరింది. 2015లో ఇప్పటివరకూ 4లక్షల 42వేల 644 మందికి వీసా మంజూరుచేశారు.
మనకు పోటీగా చైనీయులు 56శాతం అంటే సుమారు 6 లక్షల మందికి పైగా ఉద్యోగాలు చేస్తన్నట్టు బ్రిటన్ తెలిపింది. 2005లో 2లక్షల38వేల మంది భారతీయులు మాత్రమే బ్రిటన్‌లో ఉద్యోగాలు చేసేవారు. కేవలం ఉద్యోగాల్లోనే కాకుండా ఇతర వ్యాపార రంగాల్లోనూ మనవాళ్లు రాణిస్తున్నారు. బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సుమారు లక్ష మంది వరకు యూకేలో భారతీయులు విజయవంతంగా వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహిస్తున్నారు.